సోషల్ మీడియా లో ఈ మధ్య కావాలనో లేక హ్యూమర్ కోసమో కానీ మంచు విష్ణు పై ట్రోల్స్ బాగా పెరిగి పోయాయి అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యే మంచు మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా టైం లో ఈ ట్రోల్స్ పీక్స్ కి వెళ్లి పోయిన విషయం తెలిసిందే. ఆ టైం లో మంచు విష్ణు ట్రోల్ చేసే వాళ్ళ మీద కేసులు కూడా వేయబోతున్నట్లు……
భారీ ఫైన్స్ కట్టాలి అని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చినా కూడా తర్వాత అడపా దడపా ట్రోల్స్ కానీ మీమ్స్ కానీ పడుతూనే ఉన్నాయి. రీసెంట్ గా తన లేటెస్ట్ మూవీ జిన్నా ప్రమోషన్స్ లో భాగంగా మీమర్స్ తో కొందరు యూట్యూబర్స్ తో మీట్ అయిన మంచు విష్ణు…
ఆ టైం లో మరోసారి ఆసక్తి కరమైన వాఖ్యలు చేశారు…జూబిలీ హిల్స్ చెక్ పోస్ట్ లో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో 21మంది ఎంప్లాయిస్ ని నన్ను నా ఫ్యామిలీని టార్గెట్ చేయడానికి పెట్టారు. ఆ ఆఫీస్ అడ్రస్ ఒక ప్రముఖ నటుడి ఆఫీస్ IP అడ్రస్ మాకు వచ్చాయి.
85% ట్రోల్ల్స్ అక్కడినుంచే నుంచే వస్తున్నాయని మాకు సమాచారం అందింది అంటూ కామెంట్స్ చేశారు మంచు విష్ణు…. మరి పని గట్టుకుని మంచు విష్ణు కోసం ఇలా ఓ కంపెనీ పేరుతో కావాలని ట్రోల్స్ చేయించే అవసరం ఆ ప్రముఖ నటుడికి ఏముంది అనేది ఆసక్తి కరం అనే చెప్పాలి…
దాంతో పాటు మంచు విష్ణు మాట్లాడుతూ మేం 18 మంది యాక్టర్స్ ని ఇబ్బంది పెట్టె యూట్యూబర్స్ ని కనిపెట్టాము, త్వరలోనే వాళ్ళ మీద లీగల్ నోటిసులు ఇవ్వబోతున్నామని చెప్పుకొచ్చారు. ఇక మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ జిన్నా ముందు దసరా రిలీజ్ అనుకున్నా కానీ ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యి దీపావళికి బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం.