షారుఖ్ సినిమా ని బ్రేక్ చేసిన మణికర్ణిక!

0
410

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన సినిమాల రిజల్ట్ ఈ మధ్యకాలంలో సామాన్య ప్రేక్షకులనే కాకుండా అభిమానులను కూడా నిరాశ పరుస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ వచ్చిన రీసెంట్ మూవీ జీరో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో ఏమాత్రం కలెక్షన్స్ లేక టోటల్ రన్ లో కేవలం 80 కోట్ల నెట్ కలెక్షన్స్ రేంజ్ లో వసూళ్ళ ని రాబట్టి భారీ డిసాస్టర్ గా మిగిలిపోయింది.

Manikarnika Posters

కాగా తర్వాత వచ్చిన మీడియం రేంజ్ మూవీస్ ఈ కలెక్షన్స్ ని బీట్ చేసి భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన కంగనా రనౌత్ మణికర్ణిక జీరో సినిమా ఫైనల్ రన్ ఇండియా కలెక్షన్స్ ని బీట్ చేసింది.

సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు 81 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ తో దూసుకు పోతుండగా… త్వరలో 90 కోట్ల క్లబ్ లో చేరే చాన్స్ ఉంది. షారుఖ్ మూవీస్ ప్రదర్శన అందరినీ నిరుత్సాహ పరుస్తుండగా షారుఖ్ సినిమాల కలెక్షన్స్ ని ఇలా చాలా సినిమాలు దాటేస్తూ షాక్ ఇస్తున్నాయి. మరి షారుఖ్ ఇకమీదట అయినా మంచి మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!