Home న్యూస్ నారప్ప కాంట్రవర్సీ పై మణిశర్మ కామెంట్స్…ఆయనకే తెలియదు అట!

నారప్ప కాంట్రవర్సీ పై మణిశర్మ కామెంట్స్…ఆయనకే తెలియదు అట!

857
0

టాలీవుడ్ లో తన సాంగ్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసి ఒకప్పుడు ఒక ఊపిన మ్యూజిక్ డైరెక్టర్స్ లో మణిశర్మ కూడా ఒకరు, ఎన్నో హిట్ సాంగ్స్ ని అందించిన మణిశర్మ ఈ మధ్య కొంచం స్లో అవ్వగా మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్ లు బిజీ అవ్వడం తో మణిశర్మకి ఛాన్సులు తగ్గాయి. అయినా కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాలకు మంచి ట్యూన్స్ ఇచ్చిన మణిశర్మ కొన్ని సినిమాలకు సాలిడ్…

బ్యాగ్రౌండ్ స్కోర్ ని అందించి మెప్పించారు. 2019 లో రామ్ ఇస్మార్ట్ శంకర్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి సాంగ్స్ పరంగా బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా తన మార్క్ పవర్ ని చూపెట్టి వెంటనే మెగాస్టార్ తో ఆచార్య సినిమా ఛాన్స్ ను సొంతం చేసుకోగా తర్వాత మరిన్ని…

సినిమాలను ఒప్పుకున్న మణిశర్మ అందులో ధనుష్ అసురన్ తెలుగు రీమేక్ నారప్ప ని కూడా ఓకే చేయగా వెంకటేష్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అయిన గ్లిమ్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఒరిజినల్ దే వాడటం కాంట్రవర్సీగా మారగా మణిశర్మ ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఒరిజినల్ ది ఎందుకు పెట్టారు…

అన్న కామెంట్స్ రాగా వాటికి ఆన్సర్ ఎవ్వరూ ఇవ్వలేదు. ఎట్టకేలకు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో భాగంగా దీని పై స్పందించారు మణిశర్మ… అసలు సినిమా కి నన్ను పని చేయనివ్వట్లేదు, టీసర్ ఎదో రిలీజ్ చేశారు, ఒరిజినల్ నే నేను కాపీ కొట్టాను అంటూ కామెంట్స్ చేశారు కానీ ఆ విషయం కూడా నాకు తెలియదు అంటూ మణిశర్మ చెప్పుకొచ్చారు ఇప్పుడు… దానికి కారణం ఏంటి అనేది..

ఇంకా తెలియరాలేదు కానీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలకి మణిశర్మకి ఎదో ఈగో క్లాషేస్ అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మణిశర్మ కామెంట్స్ తో ఇదంతా తనకి తెలియకుండానే జరుగుతుందని కన్ఫాం అవ్వగా అది ఎవరు చేశారు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here