ఈ ఇయర్ లో మలయాళం నుండి స్టార్టింగ్ లో కొన్ని అద్బుతమైన హిట్ మూవీస్ వచ్చాయి…. బాక్ టు బాక్ హిట్స్ తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తర్వాత అప్పుడప్పుడు మంచి హిట్స్ పడగా ఇయర్ ఎండ్ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర మరో సినిమా ఊహకందని రేంజ్ లో బాక్స్ అఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషమని చెప్పాలి…
ఆ సినిమానే అడపాదడపా తెలుగు సినిమాలతో ఇక్కడ ఆడియన్స్ కి పరిచయం ఉన్న ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మార్కో(Marco Movie)….జాన్ విక్ లేటెస్ట్ హిందీ యాక్షన్ హిట్ కిల్ లాంటి సినిమాల పోలికలతో వచ్చినట్లు అనిపించిన…
మార్కో మూవీ మంచి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోగా తెలుగు లో న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ కానుండగా మలయాళంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా 8 రోజుల్లో ఆల్ మోస్ట్ 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో ఊచకోత కోస్తూ దూసుకు పోతుంది…
మొత్తం మీద సినిమా ఒకసారి 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Marco Movie 8 Days Total World Wide Collections Approx.
👉Kerala – 30.85Cr
👉Karnataka – 2.25Cr
👉Telugu States – 0.35Cr(Malayalam Version)
👉Hindi+ ROI – 2.45Cr
👉Overseas – 23.40Cr***approx.
Total WW collection – 59.30CR(27.80CR~ Share) Approx.
మొత్తం మీద ఆల్ మోస్ట్ 8 రోజుల్లో 60 కోట్లకు చేరువ అయిన సినిమా సాలిడ్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ లో అవలీలగా 100 కోట్ల గ్రాస్ మార్క్ వైపు దూసుకు పోతూ ఉండగా లాంగ్ రన్ లో అల్టిమేట్ కలెక్షన్స్ తో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక తెలుగు వర్షన్ ఎలాంటి కలెక్షన్స్ తో కుమ్మేస్తుందో చూడాలి.