Home న్యూస్ ప్రకంపనలు సృష్టిస్తున్న అఖండ…..అక్కడ 3 షోలు ఫుల్ ఏంటి సామి!!

ప్రకంపనలు సృష్టిస్తున్న అఖండ…..అక్కడ 3 షోలు ఫుల్ ఏంటి సామి!!

1968
0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి డిసెంబర్ 2 న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై ఇప్పటికే సాలిడ్ గా అంచనాలు ఏర్పడగా తెలుగు రాష్ట్రాలలో రికార్డ్ లెవల్ రిలీజ్ ను మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉండగా సినిమా ఓవర్సీస్ లో కూడా అత్యంత ఘనంగా రిలీజ్ ను…

సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని తెలుస్తుండగా సినిమా జానర్ కి ఈ రేంజ్ రిలీజ్ ఏంటి అని అందరూ ఆశ్యర్యపోతున్నారు, ఇలాంటి మాస్ మసాలా మూవీస్ ని ఓవర్సీస్ ఆడియన్స్ పెద్దగా ఇష్టపడరు, అందునా బోయపాటి మాస్ మూవీస్ రిజల్ట్ ఎప్పుడూ కూడా ఓవర్సీస్ లో..

అనుకున్న విధంగా అయితే రాలేదు. ఇలాంటి టైం లో ఈ మాస్ మూవీ కి ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను గ్రాండ్ గా ప్లాన్ చేస్తూ ఉండగా అన్ని చోట్ల బుకింగ్స్ యమ జోరుగా సాగుతూ ఉన్నాయి, ఓవర్సీస్ సినీమార్క్14, డెంటన్, డల్లాస్ లాంటి ఏరియాలలో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటలలోనే…

ప్రీమియర్ షోలు అన్నీ కూడా సోల్డ్ ఔట్ అవ్వడం బాలయ్య బోయపాటి ల కాంబో క్రేజ్ పవర్ గా చెప్పుకోవచ్చు. సెకెండ్ వేవ్ తర్వాత ఈ రేంజ్ లో అక్కడ షోలు ఫుల్స్ పడటం లవ్ స్టొరీ తర్వాత ఇది రెండో సారి అని అంటున్నారు. ఆ సినిమా అంటే క్లాస్ స్టొరీ శేఖర్ కమ్ముల ఫాక్టర్ ఓవర్సీస్ లో ప్లస్ అయింది కానీ అఖండ ఫక్తు మాస్…

కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమానే అయినా ఈ రేంజ్ లో రచ్చ చేయడం ఇప్పుడు అందరినీ ఆశ్యర్య పరుస్తుంది, ఈ జోరు చూస్తుంటే ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో సినిమా మంచి నంబర్స్ ని నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుంది. బాలయ్య రీసెంట్ మూవీస్ తో పోల్చితే సాలిడ్ గా క్రేజ్ ఈ సినిమా కి ఉండటం కచ్చితంగా సాలిడ్ ఓపెనింగ్స్ ని తెప్పించే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here