బాక్స్ ఆఫీస్ దగ్గర కరోనా వలన కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయా జనాలు థియేటర్స్ కి తిరిగి వస్తారో రారో అన్న డౌట్ ఉండగా జనాలు అనుకున్నట్లుగానే థియేటర్స్ కి తిరిగి వస్తుండటం కలెక్షన్స్ కూడా భారీగా వస్తుండటం జరుగుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ఎక్కువగా థియేటర్స్ కి తరలి వస్తుండగా కోలివుడ్ ఆడియన్స్ కూడా మాస్టర్ కోసం భారీగా థియేటర్స్ కి వస్తున్నారు.
దాంతో మాస్టర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 52 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని సమాచారం. ఇక రెండో రోజు కలెక్షన్స్ తో కలిపి టోటల్ గా 76 కోట్ల నుండి….
78 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందని అంటున్నారు. ఇక మూడో రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఈ సినిమా టోటల్ గా మరో 22 కోట్ల రేంజ్ కి తగ్గని కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని అంచనా వేస్తున్నారు. దాంతో మూడు రోజుల కలెక్షన్స్ ఇప్పుడు…
వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్క్ ని అందుకున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇది నిజంగానే మమ్మోత్ కలెక్షన్స్ అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ మార్చ్ తర్వాత ఇండియా లో మరో 100 కోట్ల గ్రాస్ మూవీ రాలేదు…థియేటర్స్ మూత బడ్డాయి… తెరచుకున్న తర్వాత 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి సినిమాగా మాస్టర్ సంచలన రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేసింది.
2021 మొట్ట మొదటి 100 కోట్ల సినిమాగా కూడా నిలిచి దుమ్ము లేపింది ఈ సినిమా. ఇక సినిమా మరో 100 కోట్ల లోపు కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర వసూల్ చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. లాంగ్ రన్ లో ఈ మార్క్ ని సినిమా అందుకోవడం పెద్ద కష్టం కాదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు లో 3 వ రోజు కలెక్షన్స్ తో సినిమా క్లీన్ హిట్ గా నిలిచింది.