Home గాసిప్స్ మాస్టర్ హిందీ…ఎర్లీ థియేటర్ కౌంట్ తెలిస్తే షాక్!!

మాస్టర్ హిందీ…ఎర్లీ థియేటర్ కౌంట్ తెలిస్తే షాక్!!

0

కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ లాస్ట్ మూవీస్ ఓ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి సంచలన విజయాలతో దుమ్ము లేపగా… విజయ్ లేటెస్ట్ మూవీ మాస్టర్ కోసం టోటల్ సౌత్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఎప్పుడో సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చినా డైరెక్ట్ రిలీజ్ కి హిస్టారికల్ రేట్ల ఆఫర్ వచ్చినా కానీ…

ఈ సినిమా ను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయిన యూనిట్ ఇప్పుడు సంక్రాంతి బరిలో భారీ లెవల్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. కాగా అందరికీ షాక్ ఇస్తూ సినిమా హిందీ లో కూడా డబ్ అయ్యి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మారడం విశేషం.

పాన్ ఇండియా లెవల్ లో హిందీ, తమిళ్, తెలుగు మరియు కన్నడ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా కి ఆల్ రెడీ హిందీ లో థియేటర్స్ ని కూడా కేటాయించడం మొదలు పెట్టారని సమాచారం. కొత్త హిందీ సినిమాలు ఏవి కూడా ఇంకా థియేటర్స్ లో రావడానికి సిద్ధంగా లేని ప్రస్తుత పరిస్థితులలో…

నార్త్ థియేటర్ ఓనర్లు కూడా ఏదైనా పెద్ద సినిమా వస్తే బాగుణ్ణు అని ఎదురు చూస్తున్న తరుణం లో మాస్టర్ హిందీ లో రిలీజ్ చేస్తాం అని చెప్పడం తో అక్కడ థియేటర్ ఓనర్లు కూడా సినిమాను భారీ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారట. ఎర్లీ థియేటర్ కౌంట్ అక్కడ ఈ సినిమా కి గాను ప్రస్తుతానికి 800 స్క్రీన్స్ ని బుక్ చేసి పెట్టినట్లు చెబుతున్నారు. ఇది నిజంగానే అద్బుతం అని చెప్పాలి.

ఇక రిలీజ్ సమయానికి ఈ లెక్క మినిమమ్ 2000 రేంజ్ లో ఉంటుంది అని అంటున్నారు. అప్పటి బజ్ ని బట్టి ఈ లెక్క మరింత పెరిగినా ఆశ్యర్యపోనవసరం లేదని చెప్పొచ్చు. పాన్ ఇండియా లెవల్ లో అద్బుతం సృష్టించడానికి మాస్టర్ కి ఫుల్ అడ్వాంటేజ్ ఉండగా తొలిసారి పాన్ ఇండియా మూవీ తో విజయ్ కూడా మార్కెట్ ఎక్స్ పాన్షన్ కి సిద్ధం అవుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here