ఇలయ దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ లెవల్ రిలీజ్ ను ఈ నెల 13 న సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై నెలకొన్న హైప్ సాలిడ్ గా ఉండటం తో సినిమా రికార్డ్ లెవల్ రిలీజ్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని అంతా భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా రిలీజ్ థియేటర్స్ లెక్క తేలడానికి ఇంకా టైం ఉంది కానీ…
తమిళనాడు లో మాత్రం సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వడం తో అక్కడ సినిమా థియేటర్స్ కౌంట్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సినిమా అక్కడ సెన్సేషనల్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇది వరకు విజయ్ నటించిన బిగిల్ సినిమా కి తమిళ్ లో…
సుమారు 750 నుండి 800 వరకు థియేటర్స్ దక్కాయి, కానీ అప్పుడు పోటి లో రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు సోలోగా అక్కడ మొదటి రోజు రిలీజ్ కానుండగా ప్రస్తుతానికి అక్కడ 650 వరకు థియేటర్స్ ని కన్ఫాం చేసుకున్న సినిమా రిలీజ్ రోజు నాటికి మొత్తం మీద…
750 రేంజ్ లో థియేటర్స్ ని కన్ఫాం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని సమాచారం. ఇక ఈ లెక్క సినిమా బుకింగ్స్ రేంజ్ ను బట్టి మొదటి రోజు 800 వరకు కూడా వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఇది నిజంగానే సెన్సేషనల్ కౌంట్ గా చెప్పుకోవచ్చు. ఈ టైం లో థియేటర్స్ రీ ఓపెన్ అవ్వడం, 100% ఆక్యుపెన్సీ కన్ఫాం అవ్వడం అండ్ రిలీజ్ కూడా రికార్డ్ లెవల్ లో…
దక్కుతూ ఉండటం తో మాస్టర్ సినిమా మొదటి రోజు తమిళనాడులో రికార్డ్ లెవల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది, ఓవర్సీస్ లో ఇప్పటికే 250 థియేటర్స్ లో రిలీజ్ ను కన్ఫాం చేసుకున్న సినిమా టోటల్ పాన్ ఇండియా లెవల్ లో ఎన్ని థియేటర్స్ ని కన్ఫాం చేసుకుంటుందో చూడాలి మరి..