కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ మరియు విజయ్ సేతుపతి ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి అల్టిమేట్ కలెక్షన్స్ తో 200 కోట్ల మార్క్ ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచి దుమ్ము లేపింది. సినిమా పై ఆడియన్స్ లో క్రేజ్ కూడా సాలిడ్ గా ఉండటం తో టాక్ కి అతీతంగా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సాధించింది.
ఇక లాంగ్ రన్ కూడా ఉంటుంది అనుకున్నా సడెన్ గా సినిమా ను 16 వ రోజు అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ చేశారు. దాంతో కోలివుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలు షాక్ అవ్వగా ఇలా చేయడానికి అమెజాన్ ప్రైమ్ మాస్టర్ టీం కి అల్టిమేట్ రికార్డ్ ఆఫర్ చేశారట.
సినిమా కి ముందు డైరెక్ట్ రిలీజ్ కోసం ఏకంగా 120 కోట్లకు తగ్గని ఆఫర్ చేసిన ప్రైమ్ వాళ్ళు తర్వాత సినిమా రిలీజ్ కి ఒప్పుకుని 24 కోట్ల రేటు చెల్లించి డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నారు నెల రోజుల టైం పెట్టి తర్వాత డిజిటల్ రిలీజ్ చేస్తామని చెప్పారు.
కానీ సడెన్ గా ఏమైందో తెలియదు రెండు వారల తర్వాత డిజిటల్ రిలీజ్ కి ఒప్పుకుంటే ఏకంగా 12 కోట్లు అధికంగా ఇస్తామని చెప్పారట ప్రైమ్ వాళ్ళు. దాంతో టీం ఆలోచించి సినిమాను డిజిటల్ రిలీజ్ కి ఒప్పుకోగా ఇప్పుడు మొత్తం మీద 36 కోట్ల రేటు కి అమెజాన్ ప్రైమ్ లో సినిమా రిలీజ్ అయిన 16 వ రోజున డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద నిర్మాతలకు ఫుల్ లాభాలను సొంతం చేసి పెట్టింది సినిమా..
మొత్తం మీద ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ 104 కోట్లు అలాగే ఇప్పుడు 36 కోట్ల డిజిటల్ రిలీజ్ రేటుతో టోటల్ గా 140 కోట్ల రేటు ని సినిమా సొంతం చేసుకుంది. ఇక శాటిలైట్ రైట్స్ అండ్ డబ్బింగ్ రైట్స్ లెక్కలు తేలాల్సి ఉండగా వాటితో సినిమా అల్టిమేట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది అని చెప్పాలి…