Home న్యూస్ మాస్టర్ కి 100% ఆక్యుపెన్సీ….ఇక ఊచకోత ఖాయం…కానీ!!

మాస్టర్ కి 100% ఆక్యుపెన్సీ….ఇక ఊచకోత ఖాయం…కానీ!!

0

కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్టర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 13 న భారీ లెవల్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఇప్పటికే భారీ క్రేజ్ ని సొంతం చేసుకోగా సినిమా కి 50% లిమిటేషన్స్ ఉన్నా కానీ భారీ ఓపెనింగ్స్ పక్కా గా వస్తాయి అని అంతా అంచనా వేస్తున్న నేపధ్యంలో…

ఇప్పుడు మరో బంపర్ న్యూస్ సినిమా గురించి రిలీజ్ అయ్యింది. తమిళనాడు లో సినిమా ఇప్పుడు ఏకంగా 100% ఆక్యుపెన్సీ తో సినిమాలను రిలీజ్ చేసుకోవచ్చు అంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ నెల 13 నుండి మొదలు అవుతుందని…

కన్ఫాం చేసింది… ఈ మధ్యే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిని కలిసి థియేటర్స్ లో 100% ఆక్యుపెన్సీ పెంచాలని కోరారని మీడియా న్యూస్ రాగా అందరూ ఇది రూమర్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇదే నిజం అయ్యింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్టర్ కి ఇప్పుడు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా మారింది.

100% ఆక్యుపెన్సీ అంటే నార్మల్ రిలీజే కాబట్టి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఓపెనింగ్స్ ఆల్ టైం రికార్డ్ లెవల్ లో దక్కే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. సినిమా పై ఉన్న అంచనాల దృశ్యా కలెక్షన్స్ మరో లెవల్ లో సొంతం అయ్యే అవకాశం ఉండగా మరో పక్క 50% ఆక్యుపెన్సీ నుండి 100% ఆక్యుపెన్సీ వలన కరోనా మళ్ళీ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉందని….

కొందరు చెబుతున్నారు… మిగిలిన చోట్ల జనాలు ఎంతలా గుమిగూడి తిరుగుతున్నా కానీ థియేటర్స్ లో 3 గంటలు ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అంటున్నారు. మరి ఇది మొత్తం మీద ప్లస్ అవుతుందా లేక కరోనా స్ప్రెడ్ కి కారణం అవుతుందా అన్నది రిలీజ్ తర్వాతే చెప్పగలం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here