కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన రీసెంట్ మూవీస్ ఏవి కూడా యునానిమస్ పాజిటివ్ టాక్ ని అయితే సొంతం చేసుకోలేదు. రీసెంట్ మూవీస్ లో ఒక్క విజిల్ సినిమా తప్పితే అన్ని సినిమాలు కూడా యావరేజ్ ఎబో యావరేజ్ రేంజ్ టాక్ నే సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి.
విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ కూడా రిలీజ్ అయ్యాక యావరేజ్ రేంజ్ టాక్ నే సొంతం చేసుకుంది, కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం అల్టిమేట్ కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటూ లాంగ్ రన్ లో సెన్సేషనల్ రికార్డులను తిరగరాస్తూ దూసుకు పోతుంది.
సినిమా రెండు వారాల్లో వరల్డ్ వైడ్ గా 216 కోట్ల గ్రాస్ ని 119 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 20 రోజులు పూర్తీ అయిన తర్వాత వరల్డ్ వైడ్ గా ఏకంగా 250 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని విజయ్ కెరీర్ లో మరో 250 కోట్ల సినిమాగా నిలిచింది.
సినిమా టోటల్ గా తమిళనాడు లో 20 రోజుల్లో 133 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని సమాచారం. టోటల్ గా 250 కోట్ల గ్రాస్ ని 129 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుంది అంటున్నారు. సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ 105 కోట్లు కాగా సినిమా మొత్తం మీద 20 రోజులు పూర్తీ అయిన తర్వాత టోటల్ గా 24 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని…
సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. మొదటి రోజు సినిమా కి వచ్చిన యావరేజ్ రేంజ్ టాక్ కి ఈ రేంజ్ లో కలెక్షన్స్ అది కూడా 50% లిమిటేషన్ లతో సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక సినిమా డిజిటల్ ప్రింట్ కూడా వచ్చినా కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దూసుకు పోతూ ఉండటం విశేషం…