Home న్యూస్ మత్తు వదలరా2 రివ్యూ…..సత్య వన్ మ్యాన్ షో!!

మత్తు వదలరా2 రివ్యూ…..సత్య వన్ మ్యాన్ షో!!

0
Mathu Vadalara 2 Movie Review and Rating
Mathu Vadalara 2 Movie Review and Rating

2019 టైం లో ఆడియన్స్ ముందుకు వచ్చి సైలెంట్ సూపర్ హిట్ గా నిలిచిన మత్తు వదలరా(Mathu Vadalara Movie)సినిమాకి సీక్వెల్ గా వచ్చిన మత్తు వదలరా2(Mathu Vadalara2 Review) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా, ఆల్ రెడీ ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలు పెంచగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే….స్పెషల్ హై ఎమర్జెన్సీ టీంలో పని చేస్తున్న సింహా కోడూరి మరియు సత్యలు అనుకోకుండా ఒక మర్డర్ ఉచ్చులో ఇరుక్కుంటారు….ఆ హత్య నుండి తప్పించుకోవడానికి వీళ్ళు ఏం చేశారు….ఆ మర్డర్ కి వీళ్ళకి ఉన్న లింక్ ఏంటి లాంటి విశేషాలు అన్నీ కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

కథ పరంగా ఏమంత కొత్తదనం లేని సింపుల్ స్టోరీ పాయింట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా, ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసే విషయంలో చాలా వరకు సక్సెస్ ఫుల్ అయింది. ముఖ్యంగా ఫస్టాఫ్ లో సత్య వన్ లైన్ పంచులు చాలా చోట్ల వర్కౌట్ అవ్వగా ఇది పూర్తిగా తన వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు…

ఆ రేంజ్ లో అందరినీ డామినేట్ చేసే రేంజ్ లో దుమ్ము లేపాడు సత్య, ఇక సింహా కోడూరి పర్వాలేదు అనిపించగా హీరోయిన్ గా ఫారియా ఓకే అనిపించింది, వెన్నెల కిషోర్ సీన్స్ కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకున్నాయి…మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి తగ్గట్లు బాగా ఇంప్రెస్ చేసింది…

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు ఫుల్ స్పీడ్ తో సాగి ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకెండ్ ఆఫ్ పై అంచనాలు భారీగా పెంచగా సెకెండ్ ఆఫ్ లో కథ కొంచం డ్రాగ్ అవుతుంది…అక్కడక్కడా సీన్స్ రిపీటివ్ గా అనిపించడంతో ఫస్టాఫ్ ఇచ్చిన జోష్ సెకెండ్ ఆఫ్ పూర్తిగా క్యారీ చేయలేక పోయినా కూడా మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి..

జోరు అందుకున్న సినిమా మంచి నోట్ తో ముగిసి ఓవరాల్ గా మంచి ఎంటర్ టైనర్ చూసిన ఫీలింగ్ ను ఆడియన్స్ కి కలిగించేలా ఎండ్ అవుతుంది అని చెప్పాలి…డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ సింపుల్ గానే ఉన్నా కూడా ఎంటర్ టైన్ మెంట్ పరంగా మాత్రం మొదటి పార్ట్ కి…

ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దాడు రెండో పార్ట్ ను….కథ సిల్లీగా అనిపించినా కూడా ఆడియన్స్ ఎక్కడా బోర్ ఫీల్ అవ్వకుండా ఎక్కువ శాతం సినిమాను ఎంజాయ్ చేస్తారు. సెకెండ్ ఆఫ్ ను మాత్రం మొదటి హాల్ఫ్ మాదిరిగానే హిలేరియస్ లెవల్ లో…

రాసుకుని ఉంటే సినిమా రేంజ్ మరో లెవల్ లో ఉండేది…అయినా కూడా ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది ఈ సినిమా…మొదటి పార్ట్ నచ్చిన ఆడియన్స్ కి అదే రేంజ్ లో రెండో పార్ట్ మెప్పిస్తుంది. ఓవరాల్ గా సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here