బాక్స్ ఆఫీస్ దగ్గర మే 1 వీకెండ్ లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్కో ఇండస్ట్రీ నుండి కొన్ని మంచి సినిమాలు ఆడియన్స్ ముందుకు రాగా అన్ని సినిమాలు దాదాపుగా లాంగ్ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరునే చూపించాయి. బాలీవుడ్ నుండి రైడ్2, టాలీవుడ్ నుండి హిట్3, తమిళ్ నుండి రెట్రో మరియు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలు…
రిలీజ్ అయ్యి వేటి రేంజ్ లో అవి జోరు చూపించగా ఈ సినిమాల కన్నా వారం ముందే రిలీజ్ అయిన మోహన్ లాల్ తుడరుం సినిమా ఎక్స్ లెంట్ హోల్డ్ ని రెండో వీకెండ్ లో కూడా చూపించి ఊచకోత కోసింది. ఇక అన్ని సినిమాలు తిరిగి వర్కింగ్ డేస్ లో ఎంటర్ అవ్వగా…
అన్ని సినిమాల హోల్డ్ ఒకెత్తు అయితే ఒక్క తుడరుం సినిమా హోల్డ్ మరో ఎత్తు అని చెప్పాలి. రైడ్2 సినిమా 5వ రోజున 106K టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ 66 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది…
హిట్3 సినిమా 60 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా రెట్రో మూవీ 35 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది. ఇక 11వ రోజులో ఉన్న తుడరుం మాత్రం 169K టికెట్ సేల్స్ ని సొంతం చేసుకుని అన్ని సినిమాలను ఓ రేంజ్ లో డామినేట్ చేసింది ఇప్పుడు….
మిగిలిన సినిమాలు 5వ రోజులోనే ఉన్నా 11వ రోజులో ఉన్న తుడరుం ఈ రేంజ్ లో ఊచకోత కోయడం టోటల్ ట్రేడ్ కే ఆశ్యర్యకరంగా మారింది. సినిమా ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ తరుపున కేరళలో 100 కోట్ల మార్క్ కొట్టబోతున్న మొదటి సినిమా కానుందని అంచనా వేస్తున్నారు… ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో ఈ జోరు ఇలానే కొనసాగే అవకాశం ఎంతైనా ఉంది.