Home న్యూస్ సందీప్ కిషన్ “మజాకా” నాన్ థియేట్రికల్ బిజినెస్….ఊరమాస్ రాంపెజ్ ఇది!!

సందీప్ కిషన్ “మజాకా” నాన్ థియేట్రికల్ బిజినెస్….ఊరమాస్ రాంపెజ్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) ఒకరు….కొన్ని మంచి సినిమాలు పడినా కూడా అనుకున్న రేంజ్ కి వెళ్ళని సందీప్ కిషన్ ఇప్పుడు కామెడీ ఎంటర్ టైనర్స్ తీయడంలో దిట్టగా పేరున్న త్రినాధరావ్ నక్కిన డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ మూవీ మజాకా మూవీ తో ఈ ఫిబ్రవరిలో..

సందడి చేయడానికి సిద్ధమవుతూ ఉండగా, ఆల్ రెడీ రిలీజ్ అయిన సినిమా టీసర్ ఆడియన్స్ లో మంచి ఆసక్తిని అయితే పెంచేసింది అని చెప్పాలి…కంప్లీట్ ఎంటర్ టైనర్ గా వస్తున్న మజాకా మూవీ ఆల్ రెడీ బిజినెస్ పరంగా దుమ్ము లేపే రేంజ్ లో రేటుని సొంతం చేసుకోవడం విశేషం…

ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ రైట్స్ సాలిడ్ రేటుకి అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది…ఓవరాల్ గా సినిమా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కింద ఆల్ మోస్ట్ 15 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకుందని సమాచారం. ఇక మ్యూజిక్ అండ్ హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ కింద..

ఆల్ మోస్ట్ 7 కోట్ల దాకా రేటు సొంతం అయ్యిందని అంటూ ఉండగా ఓవరాల్ గా సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ రేటు 22 కోట్ల దాకా సొంతం అయ్యిందట. వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా సందీప్ కిషన్ మజాకా మూవీ ఓవరాల్ గా సూపర్ సాలిడ్ రేటుని సొంతం చేసుకుందని సమాచారం…

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో ఫిబ్రవరి 21న రిలీజ్ కాబోతూ ఉండగా ఆల్ రెడీ నాన్ థియేట్రికల్ బిజినెస్ తో ఎక్స్ లెంట్ రికవరీని సొంతం చేసుకున్న సినిమా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సందీప్ కిషన్ కి ఎలాంటి కంబ్యాక్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం అయ్యేలా చేస్తుందో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here