బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ బజ్ ను సొంతం చేసుకున్న సందీప్ కిషన్(Sundeep Kishan) నటించిన లేటెస్ట్ మూవీ మజాకా(Mazaka Movie) వరల్డ్ వైడ్ గా సందీప్ కిషన్ కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకుని కుమ్మేయగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన సినిమా ముందుగా ప్రీమియర్స్ ను పూర్తి చేసుకుని ఫస్ట్ టాక్ బయటికి వచ్చేసింది…
స్టోరీ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ తండ్రి కొడుకులు అయిన సందీప్ కిషన్ మరియు రావ్ రమేష్ లు ఇద్దరూ ప్రేమలో పడతారు…మరి వీళ్ళ ప్రేమ కథ ఎలా సాగాయి తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….
స్టోరీ పాయింట్ ఓవరాల్ గా నార్మల్ గా అనిపించినా ఒక సింపుల్ పాయింట్ చుట్టూ మంచి కామెడీ సన్నివేశాలను రాసుకున్న డైరెక్టర్ త్రినాదరావ్ నక్కిన ఫుల్ ఆన్ ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ తో ఫస్టాఫ్ లో చాలా వరకు సీన్స్ కామెడీతో మెప్పించి తర్వాత ఇంటర్వెల్ ఎపిసోడ్…
సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచగా…సెకెండ్ ఆఫ్ లో కథ అక్కడక్కడా కొంచం స్లో అయినట్లు అనిపించినా మళ్ళీ కొన్ని చోట్ల కామెడీ బాగా వర్కౌట్ అవ్వగా ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ కొంచం రొటీన్ గానే అనిపించినా కూడా ఓవరాల్ ఎండ్ అయిన విధానం మెప్పించింది…
మొత్తం మీద కథ పాయింట్ రొటీన్ గానే అనిపించినా కూడా ఓవరాల్ గా స్క్రీన్ ప్లే తో మెప్పించిన మజాకా సినిమా ఎంటర్ టైన్ మెంట్ వైజ్ బాగా మెప్పించి ఈజీగా ఒకసారి చూసి మెప్పించేలా సినిమా ఉందని చెప్పాలి…. కామెడీ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి సినిమాలో…
ఎంటర్ టైన్ మెంట్ చాలా వరకు మెప్పించే అవకాశం ఉండగా సినిమా మొత్తం మీద స్టోరీ పాయింట్ ఎలా ఉన్నా కూడా ఎంటర్ టైన్ మెంట్ వైజ్ ఎబో యావరేజ్ రేంజ్ లో సినిమా ఉందని చెప్పాలి. ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత సినిమాకి ఓవరాల్ గా…
ఎబో యావరేజ్ రేంజ్ లో టాక్ ఉందని చెప్పాలి. ఇక సినిమా రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ లో టాక్ కనుక సొంతం అయితే బాక్స్ అఫీస్ దగ్గర సాలిడ్ గా కుమ్మేసే అవకాశం ఉంది. ఇక సినిమా ఆడియన్స్ నుండి ఫైనల్ గా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.