Home న్యూస్ మజాకా మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

మజాకా మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శివరాత్రి వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు పర్వాలేదు అనిపించే రేంజ్ లో అంచనాలతో సందీప్ కిషన్(Sundeep Kishan) నటించిన లేటెస్ట్ మూవీ మజాకా(Mazaka Movie) సినిమా రిలీజ్ అవ్వగా సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంది, ఆడియన్స్ మనసు గెలిచి సందీప్ కిషన్ కి మంచి కంబ్యాక్ మూవీగా నిలిచిందో లేదో తెలుసుకుందాం పదండీ..

ముందుగా కథ పాయింట్ కి వస్తే….హీరో పుట్టిన వెంటనే అతని తల్లి చనిపోవడంతో హీరో మరియు తండ్రి ఆడదిక్కు లేకుండా ఉంటారు…కొడుకుకి పెళ్లి చేయాలి అని సంభందాలు చూస్తున్న టైంలో ఆడదిక్కు లేని ఇంటికి పిల్లని ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రారు…

ఇలాంటి టైంలో హీరో మరియు హీరో తండ్రి హీరోయిన్స్ తో లవ్ లో పడతారు…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసు కోవాల్సిందే… సినిమా స్టోరీ పాయింట్ వినడానికి నార్మల్ గా అనిపించినా సరిగ్గా డీల్ చేస్తే థియేటర్స్ లో బాగా వర్కౌట్ అయ్యే కెపాసిటీ ఉన్న కథనే….

కానీ డైరక్టర్ త్రినాదరావ్ నక్కిన పార్టు పార్టులుగా బాగానే నవ్వించినా సెకెండ్ ఆఫ్ ను అనుకున్న రేంజ్ లో డీల్ చేయలేక పోయాడు. ఫస్టాఫ్ కొంచం పడుతూ లేస్తూ సాగినా కూడా కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ బాగా పండగా ఇంటర్వెల్ ఎపిసోడ్ హిలేరియస్ గా వర్కౌట్ అవ్వడంతో..

సెకెండ్ ఆఫ్ మీద అంచనాలు పెరిగిపోతాయి, కానీ సెకెండ్ ఆఫ్ లో కొత్త లైన్ ఓపెన్ అవ్వడం, ఆ లైన్ చుట్టూ అల్లుకున్న కథ కొంచం ట్రాక్ తప్పినట్లు అనిపించడం మైనస్ అయినా కూడా లైటర్ నోట్ తో చూస్తె ఎంటర్ టైన్ మెంట్ విషయంలో సినిమా చాలా చోట్ల మెప్పించింది అనే చెప్పాలి..

సందీప్ కిషన్ తన రోల్ వరకు బాగానే నటించి, నవ్వించే ప్రయత్నం చేసినా ఫుల్ మార్కులు మాత్రం రావ్  రమేష్ కే వెళతాయి. మేజర్ రోల్ సినిమాలో తనదే కాగా కొన్ని ఎక్స్ లెంట్ సీన్స్ కూడా పడ్డాయి… ఇక హీరోయిన్స్ ఇద్దరూ పర్వాలేదు అనిపించారు. సంగీతం ఓకే అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించింది..

ఒకటి రెండు సూపర్ హిట్ సాంగ్స్ పడి ఉండే సినిమాకి ఇంకా బాగా హెల్ప్ అయ్యి ఉండేది…ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు బాగా వర్కౌట్ అయింది కానీ సెకెండ్ ఆఫ్ లో కొంచం ట్రాక్ తప్పినట్లు అనిపించినా పర్వాలేదు అనిపించేలా ఉంటుంది… ఇక ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించగా డైరెక్షన్ విషయంలో.

ముందే చెప్పినట్లు త్రినాధరావ్ నక్కిన ఫస్టాఫ్ రేంజ్ లోనే సెకెండ్ ఆఫ్ ను డీల్ చేసి ఉంటే సినిమా రేంజ్ మరో లెవల్ లో ఉండేది. అయినా మంచి టైం పాస్ కోసం కొన్ని బోర్ అనిపించే సీన్స్ ను బరిస్తే మజాకా మూవీ ఎబో యావరేజ్ రేంజ్ లో మెప్పించే అవకాశం ఎంతైనా ఉంది…సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here