మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ హీరోలలో యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) ఒకరు, లాస్ట్ ఇయర్ ఊరు పేరు భైరవకోన తో పర్వాలేదు అనిపించిన తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు త్రినాదరావ్ నక్కిన డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా మజాకా(Mazaka Movie) ఈ శివరాత్రి కానుకగా…
గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా, సినిమా మీద ఆల్ రెడీ డీసెంట్ టు గుడ్ బజ్ అయితే ఆడియన్స్ లో ఉందని చెప్పాలి. ఇక సాంగ్స్ పర్వాలేదు అనిపించేలా క్లిక్ అవ్వగా టీసర్ కూడా మెప్పించిన తర్వాత ఇప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు…
సినిమా ట్రైలర్ చూసిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే వర్కౌట్ అయ్యి మంచి సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండనిపించేలా ట్రైలర్ అయితే మెప్పించింది అని చెప్పాలి ఇప్పుడు….స్టోరీ పాయింట్ ని ఆల్ మోస్ట్ రివీల్ చేసినా మేజర్ ట్విస్ట్ ను చెప్పలేదు ట్రైలర్ లో…
ఇటు కొడుకు అటు తండ్రి లవ్ లో పడతారు…వీళ్ళ ప్రేమ కథలు సఫలం అయ్యాయ లేదా మధ్యలో వచ్చిన అడ్డంకులు ఏంటి అనేది కాన్సెప్ట్ గా ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైన్ మెంట్ తో రూపొందిన మజాకా మూవీ స్టోరీ పాయింట్ బాగా వర్కౌట్ అయ్యేలా అనిపిస్తూ ఉండగా..
ట్రైలర్ లో సందీప్ కిషన్ కానీ రావ్ రమేష్ కానీ పోటి పడీ నటించి నవ్వించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది….కామెడీ సీన్స్ తో నిండిపోయిన ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ కూడా మెప్పించగా తండ్రి కొడుకులు ఇద్దరూ లవ్ లో పడటం అన్న కాన్సెప్ట్ కంప్లీట్ గా..
ఎంటర్ టైన్ మెంట్ వె లో చెప్పడం సినిమాకి మేజర్ హైలెట్ కాబోతుంది అని చెప్పాలి. ఈ నెల 26న రిలీజ్ కాబోతున్న మజాకా సినిమా ట్రైలర్ మెప్పించిన రేంజ్ లో ఆకట్టుకుంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.