Home న్యూస్ మజాకా మూవీ బిజినెస్ అండ్ క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

మజాకా మూవీ బిజినెస్ అండ్ క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన సందీప్ కిషన్(Sundeep Kishan) నటించిన లేటెస్ట్ మూవీ మజాకా(Mazaka Movie) ఆడియన్స్ ముందుకు ఈ శివరాత్రి కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా, ఆల్ రెడీ రిలీజ్ అయిన సినిమా అఫీషియల్ ట్రైలర్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటూ ఉండగా..

సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉండగా ఈ సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్ సొంతం అవుతుందని నమ్మకంతో ఉన్నాడు సందీప్ కిషన్. బిజినెస్ పరంగా కూడా కుమ్మేసిన మజాకా మూవీ అన్ని చోట్లా మంచి రేట్స్ ను సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి.

సినిమా నైజాంలో 3.2 కోట్లు, సీడెడ్ లో 1.8 కోట్లు కోస్టల్ ఆంధ్ర లో 4 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల రేంజ్ లో సినిమా వాల్యూ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ కలిపి మరో 1.5 కోట్ల రేంజ్ లో..

సినిమా బిజినెస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ 10.50 కోట్ల దాకా జరిగింది. దాంతో సినిమా సందీప్ కిషన్ కెరీర్ లో మరో డీసెంట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది… ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే…

11.50 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సిన అవసరం ఉంది. సినిమా మీద ఉన్న డీసెంట్ బజ్ కి శివరాత్రి వీకెండ్ అడ్వాంటేజ్ కలిసి వచ్చి టాక్ కొంచం పాజిటివ్ గా ఉన్న అన్ సీజన్ అయినా కూడా టార్గెట్ ను సినిమా రికవరీ చేసే అవకాశం ఎంతైనా ఉంటుదని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here