చాలా టైంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో ఒకరైన సందీప్ కిషన్(Sundeep Kishan) నటించిన లేటెస్ట్ మూవీ మజాకా(Mazaka Movie)సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం…
మరీ అనుకున్న రేంజ్ లో జోరు చూపించ లేక పోయింది. దాంతో ఓపెనింగ్స్ ఓకే అనిపించినా లాంగ్ రన్ లో అనుకున్న రేంజ్ లో ఫుట్ ఫాల్స్ ను సొంతం చేసుకోలేక పోయిన సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ను త్వరగానే కంప్లీట్ చేసుకుంది…
సందీప్ కిషన్ సినిమా మీద మంచి ఆశలే పెట్టుకున్నా కూడా సినిమా పెద్దగా ఇంపాక్ట్ ను ఏమి చూపించ లేక పోయింది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 10.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
Mazaka Movie Total World Wide Collections Report(Inc GST)
👉Nizam: 2.10Cr
👉Ceeded: 95L
👉Andhra: 2.45Cr~
AP-TG Total:- 5.50CR(10.75CR~ Gross)
👉KA+ROI+OS : 1.00CR****approx
Total WW Collections: 6.50CR(Gross – 12.75CR~)
(60%~ Recovery)
ఓవరాల్ గా సినిమా 10.50 కోట్ల టార్గెట్ లో 4.70 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని రన్ ని పూర్తి చేసుకుని డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది… సినిమా కంటెంట్ ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ లో ఇంకొంచం బెటర్ గా ఉండి ఉంటే సినిమా రిజల్ట్ ఇంకొంచం బెటర్ గా ఉండేదని చెప్పొచ్చు. ఇక సందీప్ కిషన్ క్లీన్ హిట్ వేట కొనసాగుతూనే ఉంది.