బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ మంచి హిట్ మూవీస్ తో కెరీర్ లో ఇప్పుడు బెస్ట్ ఫామ్ తో దూసుకు పోతున్న టాలీవుడ్ యంగ్ హిరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన కొత్త సినిమా మెకానిక్ రాకీ(Mechanic Rocky Movie Review) సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా ముందుగా…
ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకోగా ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలుసుకుందాం పదండీ…కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ మొత్తం మీద పాయింట్ హీరో తన తండ్రి మెకానిక్ షాప్ లో ఉంటాడు…
హీరోయిన్స్ ఇద్దరికీ కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ లవ్ లో పడేయడానికి ట్రై చేస్తూ ఉన్న టైంలో విలన్ తో హీరో కి గొడవ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… కథ పాయింట్ ఫస్టాఫ్ వరకు పాత్రల పరిచయంతో సరిపోగా…
సీన్ బై సీన్ వస్తూ వెళుతూ ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆసక్తిని అనుకున్న రేంజ్ లో పెంచకపోవడంతో కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించినా ఎక్కువగా బోర్ అనిపించకుండా కథ సాగుతూ మళ్ళీ ఇంటర్వెల్ నుండి జోరు అందుకున్న సినిమా మంచి పాయింట్ తో…
ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరగగా సెకెండ్ ఆఫ్ కథ స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ ఫస్టాఫ్ కన్నా బెటర్ గా సాగుతూ కొన్ని చోట్ల మేజర్ టర్న్ లు ట్విస్ట్ లు ఆకట్టుకోగా ప్రీ క్లైమాక్స్ కథ కొంచం రొటీన్ గానే సాగినా కూడా ఓవరాల్ గా…
ఫస్టాఫ్ తో పోల్చితే సెకెండ్ ఆఫ్ బెటర్ గా అనిపించింది అని చెప్పాలి. ఫస్టాఫ్ ను కూడా సెకెండ్ ఆఫ్ రేంజ్ లో తీసి ఉంటె సినిమా ఇంకా బెటర్ గా మెప్పించేది అని చెప్పొచ్చు. మొత్తం మీద సినిమా ఫస్టాఫ్ యావరేజ్ లెవల్ లో.. సెకెండ్ ఆఫ్ ఇబో యావరేజ్ లెవల్ లో అనిపించగా…
ఫైట్స్, హీరో ఎలివేషన్ సీన్స్, మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఆకట్టుకోవడంతో సినిమా వన్ టైం వాట్చబుల్ మూవీలా అనిపించింది…. మొత్తం మీద సినిమా ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యే టైంకి యావరేజ్ టు ఇబో యావరేజ్ లెవల్ కి మధ్యలో ఉంది అనిపించింది. ఇక రెగ్యులర్ షోలకు సినిమా కి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.