బాక్ టు బాక్ మంచి సినిమాలతో కెరీర్ లో బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్న యంగ్ హిరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన కొత్త సినిమా మెకానిక్ రాకీ(Mechanic Rocky Movie Review) సినిమా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న తర్వాత డీసెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు రెగ్యులర్ షోలతో ఎలా మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ కి వస్తే…చదువు పూర్తి అయినా ఖాళీగా ఉండే హీరో తన తండ్రి గ్యారేజ్ లో పని చేస్తూ మోటర్ డ్రైవింగ్ క్లాసెస్ చెబుతూ ఉంటాడు…ఈ క్రమంలో తన గ్యారేజ్ ను దక్కించుకోవాలని విలన్స్ చూస్తూ ఉండటంతో హీరో ఏం చేశాడు ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే….
కథ పాయింట్ పరంగా చాలా బేసిక్ పాయింట్ తో తెరకెక్కిన సినిమా ఈ మెకానిక్ రాకీ, ఫస్టాఫ్ వరకు పెద్దగా స్టోరీ ఏమి లేకుండా పై పైన మెరుగులతో హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్, అక్కడక్కడా చిన్న కామెడీ బిట్స్ వస్తూ వెళుతూ ఉన్నప్పటికీ ఫస్టాఫ్ లో కథ అంటూ ఏమి ఉండదు…. ఏంటి సినిమా ఇలా ఉంది అనిపించేలా…
ఆడియన్స్ అనుకుంటూ ఉన్న టైంలో సెకెండ్ ఆఫ్ కథ స్టార్ట్ అవ్వడం నుండి ఆడియన్స్ మనసు మారుతుంది…ఆసక్తి కరమైన సీన్స్, కొన్ని మేజర్ ట్విస్ట్ లతో సెకెండ్ ఆఫ్ చూసిన తర్వాత్ అసలు పాయింట్ ను సెకెండ్ ఆఫ్ లో పెట్టి ఫస్టాఫ్ అంతా డైరెక్టర్ టైం పాస్ చేశాడు అనిపిస్తుంది…
ఆ సెకెండ్ ఆఫ్ సినిమాకి మేజర్ గా ప్రాణం పోసింది, కానీ అదే టైంలో ఫస్టాఫ్ లో కథ లేక పోవడంతో సీన్స్ వస్తూ వెళుతూ ఉన్నా ఏమాత్రం ఆసక్తి కలిగించలేక పోయింది…ఫస్టాఫ్ ను ఎంటర్ టైన్ మెంట్ వే లోనే ఎక్కువగా చెప్పి ఉంటే సినిమా రేంజ్ మరో లెవల్ లో ఉండేది…
ఇక విశ్వక్ సేన్ మరోసారి ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, డైలాగ్స్, మాస్ మూమెంట్స్, డాన్స్ ఇలా సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత పడ్డాడు…హీరోయిన్స్ ఇద్దరిలో సాక్షి చౌదరి కి బెటర్ సీన్స్ పడ్డాయి. మిగిలిన యాక్టర్స్ ఓకే అనిపించారు. సాంగ్స్ పర్వాలేదు అనిపించగా…
బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే ఆకట్టుకుంది. ఎడిటింగ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ పరంగా ఆకట్టుకోలేదు కానీ సెకెండ్ ఆఫ్ బాగుంది….ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించగా, డైరెక్టర్ ఎంచుకున్న మేజర్ పాయింట్ సెకెండ్ ఆఫ్ కే పరిమితం చేయడం, ఫస్టాఫ్ లో కథ లేకుండా చేసింది…కానీ ఫస్టాఫ్ లో కథ గురించి…
ఏమాత్రం హింట్ ఇచ్చినా పూర్తి కథ ఆడియన్స్ గెస్ చేసేసే అవకాశం ఉండటంతో పై పైన మెరుగులతో ఫస్టాఫ్ ను నడిపించాడు డైరెక్టర్, సెకెండ్ ఆఫ్ ను బాగానే మ్యానేజ్ చేయడంతో ఓవరాల్ గా సినిమా అయిన తర్వాత పర్వాలేదు బాగుంది అనిపించేలా ఉంటుంది సినిమా…కానీ ఫస్టాఫ్ మీద మరింత శ్రద్ధ పెట్టి ఉంటే పక్కా ఫుల్ పైసా వసూల్ మూవీలా అనిపించేది…ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్…