Home గాసిప్స్ రామ్ చరణ్ మీదే ఫైర్ అవుతున్న మెగా ఫ్యాన్స్…రీజన్ ఇదే!!

రామ్ చరణ్ మీదే ఫైర్ అవుతున్న మెగా ఫ్యాన్స్…రీజన్ ఇదే!!

1264
0

     అదేంటి రామ్ చరణ్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా… ఇది చాలా వరకు నిజమే, డానికి కారణం లేకపోలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాల్లో ఒకటిగా నిలిచిన సినిమా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సెన్సేషనల్ మూవీ సైరా నరసింహా రెడ్డి. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా రిలీజ్ కి పట్టుమని 20 రోజులు కూడా లేవు.

కానీ ఇప్పటి వరకు సినిమా కి సంభందించిన ప్రమోషన్ పనులు అసలు మొదలే కాలేదు. ఆగస్ట్ 22 న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు లో టీసర్ రిలీజ్ తప్పితే ఇప్పటి వరకు ఒక పాట గురించి కానీ ట్రైలర్ లాంచ్ గురించి కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కానీ…

ఎలాంటి అప్ డేట్ కూడా లేదు. దాంతో మెగా ఫ్యాన్స్ సైరా నిర్మాత అయిన రామ్ చరణ్ పై సోషల్ మీడియా లో ఫైర్ అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా కి అంత పబ్లిసిటీ అవసరం లేదు కానీ పాన్ ఇండియా సినిమా అవ్వడం తో అసలు ప్రమోషన్స్ ఇంకా మొదలు కాకపోవడం తో బాలీవుడ్ లో సినిమా వస్తుందని ఎవరికీ తెలియదని వారి వాదన.

అలాగే సౌత్ లో మిగిలిన చోట్ల కూడా ఆ సినిమా పై బయట పెద్దగా బజ్ లేదు. దాంతో ఇప్పటికైనా తేరుకుని సినిమా సాంగ్స్ ని ట్రైలర్ అనౌన్స్ మెంట్ ఇలా వరుస ప్రమోషన్స్ చేస్తేనే సినిమా రిలీజ్ రోజు ఇండియా వైడ్ గా సంచలన ఓపెనింగ్స్ సొంతం చేసుకుంటుంది అన్నది ఫ్యాన్స్ వాదన.

కానీ యూనిట్ అండ్ నిర్మాత మాత్రం ఇవన్నీ కాకుండా ఒక్క ఈవెంట్ తో అన్ని చోట్లా సినిమా కు క్రేజ్ తీసుకువచ్చే పక్కా ప్లానింగ్ లో ఉన్నాడని, త్వరలోనే ఓ నికార్సయిన అప్ డేట్ వస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here