Home న్యూస్ మేకసురి2 రివ్యూ….మాస్ కుమ్ముడు…కానీ!!

మేకసురి2 రివ్యూ….మాస్ కుమ్ముడు…కానీ!!

0

కరోనా టైం లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న చిన్న సినిమాలలో మేకసురి సినిమాలు కూడా ఒకటి, మొదటి పార్ట్ జులై ఎండ్ లో రిలీజ్ అవ్వగా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ చూసిన వారు మాత్రం పెర్ఫార్మెన్స్ అండ్ టేకింగ్ మాత్రం బాగుంది అని మెచ్చుకున్నారు. గంటన్నర లోపే లెంత్ ఉన్న ఆ సినిమా సైలెంట్ గా ఆకట్టుకున్న తర్వాత ఇప్పుడు సీక్వెల్ ని రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ చేశారు.

మరి ఈ సీక్వెల్ ఎంతవరకు ఆకట్టుకుంది అన్నది తెలుసుకుందాం పదండి. కథ పాయింట్ మొదటి పార్ట్ ఎక్కడ ముగిసిందో అదే పాయింట్ తో మొదలు అవుతుంది…మేకసురి వెనక ఉన్న దళం ఏంటి, దళంతో కలిసి గోపాలరావ్ ను ఎందుకు చంపాడు అనే పాయింట్ తో సీక్వెల్ స్టార్ట్ అవుతుంది.

తర్వాత పోలిసుల నుండి ఎలా తప్పించారు, సూర్య భార్యను ఎవరు చంపారు, వాళ్ళ పై మేక సూరి ఎలా పగ తీర్చుకున్నాడు లాంటి సస్పెన్స్ తో ఈ సీక్వెల్ కథ ఉంటుంది, గంటన్నర లోపే లెంత్ కాబట్టి కథ చెబితే చూడటానికి ఏమాత్రం బాగుండదు.

పెర్ఫార్మెన్స్ పరంగా అందరూ బాగా చేశారు, సీక్వెల్ కాబట్టి మొదటి పార్ట్ కి కంటిన్యుగా సినిమా లో అందరి పెర్ఫార్మెన్స్ ఇంటెన్స్ తో అలాగే కంటిన్యు అయ్యింది అని చెప్పొచ్చు. మెయిన్ రోల్ చేసిన అభియన్ లుక్ బాగానే సెట్ అయింది పెర్ఫార్మెన్స్ అద్బుతంగా చేశారు. నేటివిటీకి తగ్గట్లు అందరి డైలాగ్స్ కూడా బాగా మెప్పించాయి అని చెప్పాలి.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే తక్కువ లెంత్ అయినా కానీ స్లో నరేషన్ వలన కొంచం బోర్ కొడుతుంది, సంగీతం ఓకే అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా మెప్పించింది అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. రెండో పార్ట్ కూడా చూశాక…

మంచి కంక్లూజన్ ఇచ్చారు అని చెప్పొచ్చు. ఇక డైరెక్షన్ పరంగా త్రినాధ్ వెలిశిల అనుకున్న పాయింట్ ని బాగానే తీసినా మరీ స్లో నరేషన్, ఓవర్ బిల్డప్ గా అనిపించింది కొన్ని సీన్స్ కి, క్లైమాక్స్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బాగా హ్యాండిల్ చేసినా మెయిన్ పాత్రలకు మనం కనెక్ట్ అవ్వడం తక్కువే అని చెప్పాలి, కానీ మాస్ సీన్స్ ని బాగా తీసి…

ఆడియన్స్ ని మెప్పించారని చెప్పొచ్చు. లెంత్ తక్కువే ఉన్నా కానీ డైరెక్టర్ అనుకుంటే మరింత డీటైల్స్ ని చెప్పే స్కోప్ ఉన్నా స్లో నరేషన్ తోనే నడిపించడం ఒక స్టేజ్ లో బోర్ కొడుతుంది. అది తప్పితే మేకసురి 2 మాస్ ఆడియన్స్ ను ఇలాంటి రా రస్టిక్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళను బాగానే మెప్పించే అవకాశం ఉందని చెప్పాలి.

కానీ మొత్తం మీద సీక్వెల్ అయిన మేకసురి 2 కొన్ని కొన్ని సీన్స్ పరంగా బాగా మెప్పించినా ఓవరాల్ గా ఒక సినిమా పరంగా మాత్రం జస్ట్ యావరేజ్ అనే విధంగా మాత్రమే ఉంది, కానీ మాస్ మూవీస్ ఇష్టపడే వారికి సినిమా లో యాక్షన్ బాగా నచ్చే అవకాశం ఉంది, మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here