బాక్స్ ఆఫీస్ దగ్గర వినరో భాగ్యము విష్ణుకథ లాంటి హిట్ మూవీ తర్వాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కమర్షియల్ మూవీ మీటర్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది, పోటి లో రవితేజ రావణాసురతో పోటి పడటం వలన సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు, దానికి తోడూ సినిమా టాక్ కూడా కంప్లీట్ గా నెగటివ్ గా రావడంతో…
సినిమా ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది. సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాంలో 26 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 55 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. కాగా ఈ కలెక్షన్స్ లో చాలా వరకు…
సెంటర్స్ లో డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ లాంటివి పడటంతో సినిమా కి పెద్దగా షేర్ ఏమి రాలేదు, ట్రేడ్ లెక్కల్లో సినిమా మొదటి రోజు 20 లక్షల రేంజ్ లోనే షేర్ ని అటూ ఇటూగా అందుకుని ఉండొచ్చు అని అంటున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 25 లక్షల లోపు షేర్ ని…
అటూ ఇటూగా సొంతం చేసుకోవచ్చు అంటూ ఉండగా సినిమా వాల్యూ బిజినెస్ 4 కోట్ల దాకా ఉండగా 4.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే ఇంకా 4.25 కోట్ల దాకా కలెక్షన్స్ ని సాధించాల్సి ఉంటుంది. సినిమా రెండో రోజు స్టేటస్ చూస్తూ ఉంటె ఫస్ట్ డే లో సగం కూడా కలెక్ట్ చేసే అవకాశం కనిపించడం లేదు ఇప్పుడు.