Home న్యూస్ మీటర్ రివ్యూ…రేటింగ్….ఏంటి సామి ఇదీ!!

మీటర్ రివ్యూ…రేటింగ్….ఏంటి సామి ఇదీ!!

0

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఆల్ రెడీ ఈ ఇయర్ వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో హిట్ అందుకోగా రెండు నెలలు తిరగక ముందే ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ మీటర్ తో వచ్చేశాడు, ఫుల్ లెంత్ కమర్షియల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తో మాస్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకోవాలని ఆశించిన కిరణ్ అబ్బవరం ఆశలు నిజం అయ్యయో లేదో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే… సిన్సియర్ పోలిస్ కొడుకు అయిన హీరో లైఫ్ లో పోలిస్ అస్సలు అవ్వకూడదు అనుకుంటూనే…

పోలిస్ అవ్వాల్సి వస్తుంది, ఆ జాబ్ నుండి తప్పుకోవాలని కొన్ని తప్పులు చేసే క్రమంలో ఒక నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… కిరణ్ అబ్బవరంకి ఇది ఫస్ట్ కమర్షియల్ మూవీ కావొచ్చు కానీ ఇలాంటి రొట్టకొట్టుడు స్టొరీ లైన్స్ తో టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు ఆల్ రెడీ వచ్చేశాయి…. ఇక్కడ ట్రీట్ మెంట్ అయినా ఎంటర్ టైన్ చేసిందా అంటే అది కూడా లేదు…

చాలా సీన్స్ లో అవసరం ఉన్న లేకున్నా ఓవర్ బిల్డప్ షాట్స్, ఎలివేషన్స్ ఒక స్టేజ్ దాటాక చిరాకు తెప్పిస్తాయి. కిరణ్ అబ్బవరం నటన పరంగా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అలాగే తన లుక్ రీసెంట్ మూవీస్ అన్నింటిలో కూడా ఒకేలా ఉంటూ వస్తుంది, ఓవరాల్ గా కొంచం బిల్డప్ షాట్స్ ఓవర్ గా అనిపించినా తన పెర్ఫార్మెన్స్ పర్వాలేదు… హీరోయిన్ జస్ట్ ఓకే, మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించగా…

పాటలు సహనానికి పరీక్ష పెడతాయి, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు, ఎడిటింగ్ స్క్రీన్ ప్లే పరంగా బోర్ కొట్టేలా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు అనిపిస్తాయి, ఇక డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా రొటీన్ కథ కాగా ఏ దశలో కూడా ఆడియన్స్ ను ఇంప్రెస్ అయితే చేయలేక పోయింది అని చెప్పాలి…

అక్కడక్కడా చిన్న కామెడీ బిట్స్, కొన్ని బిల్డప్ సీన్స్ పర్వాలేదు అనిపించినా, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, వీక్ డైరెక్షన్ ఇలా చెప్పుకుంటూ పొతే సినిమా లో చాలానే మైనస్ పాయింట్స్ ఉన్నాయి. టైమ్ పాస్ కోసం థియేటర్స్ కి వెళ్ళినా సినిమా కంప్లీట్ చేయాలి అంటే చాలా అంటే చాలా ఓపిక అవసరం… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 1.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here