Home న్యూస్ మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్ టాక్ ఏంటి…డే 1 మాస్ కలెక్షన్స్!!

మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్ టాక్ ఏంటి…డే 1 మాస్ కలెక్షన్స్!!

0

హాలీవుడ్ మూవీస్ లో ఇండియాలో బాగా పాపులర్ అయిన సిరీస్ లలో మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ ముందు నిలుస్తుంది. టామ్ క్రూజ్ చేసే రియల్ ఫైట్స్, యాక్షన్ సీన్స్ కి ఓ రేంజ్ లో ఫ్యాన్స్ అయ్యారు…ఇక ఈ సిరీస్ లో ఇప్పుడు ఫైనల్ పార్ట్ గా మిషన్ ఇంపాజిబుల్ ఫైనల్ రికనింగ్(Mission Impossible: The Final Reckoning) సినిమా…

మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో వచ్చేసింది….రెండేళ్ళ క్రితం వచ్చిన పార్ట్ 1 లో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వలన ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి అన్న పాయింట్ తో కథ నడవగా ఆ ప్రమాదాన్ని ఆపడానికి ఒక కీ అవసరం అని తెలుసుకుని ఆ కీ ని దక్కించుకోవడంతో.

పార్ట్ 1 ముగియగా సెకెండ్ పార్ట్ లో ఆ కీ సహాయంతో ప్రమాదాన్ని ఆపడానికి హీరో చేసిన సాహసాలు ఏంటి…ఈ క్రమంలో తను ఫేస్ చేసిన పరిస్థితులను దాటుకుని హీరో అనుకున్నది ఎలా సాధించాడు అన్నది ఫైనల్ పార్ట్ కథ పాయింట్ అని చెప్పొచ్చు…

ఈ సిరీస్ లలో కథ పాయింట్ అంటూ పెద్దగా ఏమి ఉండదు కానీ ఒక సింపుల్ పాయింట్ కి అబ్బుర పరిచే యాక్షన్ సీన్స్ తో టైట్ స్క్రీన్ ప్లే మేజర్ హైలెట్స్ గా నిలుస్తూ మెప్పిస్తాయి.. ఫైనల్ పార్ట్ విషయంలో కూడా ఇదే జరిగింది అని చెప్పాలి. ఫస్టాఫ్ కొంచం ఓకే అనిపించేలా సాగినా…

సెకెండ్ ఆఫ్ టైట్ స్క్రీన్ ప్లే తో మెప్పించి తర్వాత సీన్ ఏమవుతుందా అన్న ఆసక్తిని చివరి వరకు కొనసాగించి సిరీస్ కి ఎక్స్ లెంట్ ఎండ్ ని ఇచ్చారు…కొంచం ఎమోషనల్ అయ్యేలా చేసినా కూడా ఓవరాల్ గా ఫైనల్ పార్ట్ అంచనాలను బాగానే అందుకుని మెప్పించింది అని చెప్పాలి…

మరోసారి టామ్ క్రూజ్ తనదైన యాక్షన్ సీన్స్, రియల్ స్టంట్స్ తో మాస్ రచ్చ చేశాడు…తన పాత్ర ఈతన్ హంట్ రోల్ కి గ్రాండ్ ఎండ్ ని ఇచ్చారు సినిమాలో… ఓవరాల్ గా మంచి అంచనాలతో వెళ్ళినా ఆ అంచనాలను బాగానే అందుకుంటుంది సినిమా…

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజున ఎక్స్ లెంట్ గా దుమ్ము లేపిన సినిమా 17.5 కోట్లకు పైగానే నెట్ కలెక్షన్స్ ని ఇండియాలో సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ స్టార్ట్ ను దక్కించుకోగా లాంగ్ రన్ లో కచ్చితంగా మాస్ రచ్చ చేసే వసూళ్ళని సినిమా అందుకోవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here