టాం క్రూజ్( Tom Cruise) హీరోగా నటించిన మిషన్ ఇంపాజిబుల్(Mission: Impossible) ఫ్రాంచేజ్ నుండి లేటెస్ట్ గా వచ్చిన 7వ పార్ట్ మిషిన్ ఇంపాజిబుల్ 7 డెడ్ రేకనింగ్ పార్ట్ 1(Mission: Impossible 7 Dead Reckoning Part One) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా…
సినిమా మీద హాలీవుడ్ లో భారీ అంచనాలు ఉండగా ఇండియాలో కూడా ఈ సినిమా మీద అంచనాలు సాలిడ్ గా ఉండగా రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా ఓపెనింగ్స్ పరంగా ఈ ఫ్రాంచేజ్ లో ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ అన్నింటిలోకి…
హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది సినిమా… సినిమా మొదటి రోజు ఇండియాలో 12.20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఈ ఫ్రాంచేజ్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది ఇప్పుడు.
ఇది వరకు వచ్చిన Mission: Impossible 6 మూవీ ఇండియాలో మొదటి రోజు 9.30 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు వచ్చిన పార్ట్ 7 సినిమా మొదటి రోజు వర్కింగ్ డే లో కూడా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకుంది. వీకెండ్ లో కానీ హాలిడే లో కానీ…
రిలీజ్ అయ్యి ఉంటే ఈ ఓపెనింగ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉండేది. ఇక లాంగ్ వీకెండ్ లో సినిమా 45-50 కోట్ల కి అటూ ఇటూగా నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి సినిమా వీకెండ్ లో ఈ అంచనాలను మించి జోరు చూపిస్తుందో చూడాలి.