Home న్యూస్ మిషిన్ ఇంపాజిబుల్7 టాక్ ఏంటి…సినిమా ఎలా ఉందంటే!!

మిషిన్ ఇంపాజిబుల్7 టాక్ ఏంటి…సినిమా ఎలా ఉందంటే!!

0

హాలీవుడ్ నుండి ఈ వీక్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమా మిషిన్ ఇంపాజిబుల్7 (Mission: Impossible 7 Telugu Review)…. అద్బుత సాహస విన్యాసాలతో ఏజ్ పెరుగుతున్నా ఆడియన్స్ ని ఇప్పటికీ అలరించడంలో ముందుండే టామ్ క్రూజ్ హీరోగా నటించిన…

ఈ సిరీస్ లో 7వ పార్ట్ గా వచ్చిన Mission: Impossible 7 Dead Reckoning Part One ఇండియాలో కూడా భారీగా రిలీజ్ అవ్వగా సినిమా ఓపెన్ అవ్వడమే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(AI) మిషన్ తో స్టార్ట్ అయ్యి ఎవ్వరూ గుర్తు పట్టలేని ప్లేస్ లో ఒక అతి పెద్ద విపత్తు ఉండగా…

ఆ విపత్తుని ఆ మిషన్ ని ఆపడానికి ఒక కీ అవసరంతో స్టార్ట్ అవుతుంది. ఆ కీ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో హీరో ఎలా తెలుసుకున్నాడు అన్నది పార్ట్ 1 స్టొరీ. పార్ట్ 2 కోసం ఈ పార్ట్ 1 ని పెర్ఫెక్ట్ గా సెట్ చేశారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కథ కొంచం స్లోగా సాగుతుంది… లెంత్ కొంచం ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది.

కానీ యాక్షన్ పార్ట్, విజువల్స్, చేజింగ్స్ అన్నీ అద్బుతంగా ఉండటంతో కొంత బోర్ కొట్టినా కానీ సినిమా పార్ట్ 2 కి పెర్ఫెక్ట్ సెట్ లా అనిపిస్తుంది. ఇందులో మరీ వావ్ అనిపించేలా సీన్స్ అంటే ఒక్క బ్రిడ్జ్ నుండి హీరో దూకే సీన్ అనే చెప్పాలి. ఆ సీన్ అలాగే ట్రైన్ కూలిపోయే సీన్ బాగా తీయగా మిగిలిన సీన్స్ పర్వాలేదు అనిపిస్తుంది…

ప్రీవియస్ పార్ట్స్ తో పోల్చితే యాక్షన్ పార్ట్ ఇందులో కొంచం తగ్గినట్లు అనిపించగా, AI చుట్టూ అల్లుకున్న కథ పెద్దగా ఆసక్తిని క్రియేట్ చేయలేక పోయింది. కానీ పార్టు పార్టులుగా చూస్తె మాత్రం సినిమా ఆకట్టుకునేలా ఉందని చెప్పాలి. సినిమా స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయ్యి…

ఓ 20 నిమిషాల తర్వాత స్లో అయినట్లు అనిపిస్తుంది, కానీ పెద్దగా బోర్ అయ్యే సీన్స్ తక్కువగా ఉండగా ఇంటర్వెల్ తర్వాత సెకెండ్ ఆఫ్ లో ఒక ఫైట్ సీన్ బాగుండగా మళ్ళీ క్లైమాక్స్ ట్రైన్ సీక్వెన్స్ బాగుంటుంది కానీ మిగిలిన మేజర్ కథ మొత్తం పార్ట్ 2 లో ఉండబోతుండటంతో పార్ట్ 1 ని సింపుల్ గా ముగించారు అనిపిస్తుంది…

టామ్ క్రూజ్ బ్రిడ్జ్ మీద నుండి దూకే సీన్ మాత్రం మెస్మరైజ్ చేయగా సినిమాలో ఆ సీనే హైలెట్ అని చెప్పాలి. మొత్తం మీద మరీ ఎక్స్ పెర్టేషన్స్ ని పెంచుకుని వెళ్ళకుండా నార్మల్ గా థియేటర్స్ కి వెళితే సినిమా బాగుంది అనిపిస్తుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here