Home TRP రేటింగ్ 30 లక్షలకు కొంటే….వచ్చిన TRP రేటింగ్ ఊరమాస్!!

30 లక్షలకు కొంటే….వచ్చిన TRP రేటింగ్ ఊరమాస్!!

2521
0

సైకో థ్రిల్లర్ జానర్ లో వచ్చిన వన్ ఆఫ్ బెస్ట్ మూవీస్ అన్నీ కూడా రీసెంట్ టైం లోనే వచ్చినవి, రాక్షసుడు సినిమా తర్వాత వీటి పై మరింత క్రేజ్ పెరిగి పోగా తర్వాత మలయాళంలో ఫోరెన్సిక్ అనే సినిమా తర్వాత అంజిమ పాతిర అనే సినిమాలు వచ్చాయి. రెండూ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలుగా నిలవగా ఈ సినిమాలను తెలుగు లో రీమేక్ చేస్తారు అనుకున్నా అలా జరగలేదు.

కానీ ఈ సినిమాలను తెలుగు లో డబ్ చేసి ముందుగా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేసింది ఆహా వీడియో వాళ్ళు. ఫోరెన్సిక్ మంచి విజయాన్ని నమోదు చేయగా ఆ సినిమా తో పోల్చితే కంటెంట్ పరంగా ఇంకా బెటర్ అనిపించే అంజిమ పాతిర తెలుగు ల…

మిడ్ నైట్ మర్డర్స్ అనే పేరు తో డబ్ చేయడం ఆ టైటిల్ అంతలా క్యాచిగా లేక పోవడం తో మరీ అనుకున్న రేంజ్ లో ఆడియన్స్ లో ఈ సినిమా జొచ్చుకు పోలేదు. కానీ సినిమా ఒరిజినల్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం తెలుగు లో బాగానే ఎంజాయ్ చేశారు ఈ సినిమా ను…

తర్వాత ఈ సినిమా ను స్టార్ మా ఛానెల్ వాళ్ళు కేవలం 30 లక్షల రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ హక్కులను సొంతం చేసుకున్నారు. రీసెంట్ టైం లో ఇలా తక్కువ రేట్లకే సినిమాలను కొని మంచి టైం లో టెలికాస్ట్ చేసి సాలిడ్ TRP రేటింగ్ లను సొంతం చేసుకుంటున్న స్టార్ మా వాళ్ళు ఈ సినిమా విషయం లో కూడా మళ్ళీ అలానే చేసి…

ఈ సారి 5.53 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపారు. ఇది మరీ అద్బుతమైన రేటు కాక పోయినా కానీ సినిమా ను కొన్న రేటు ప్రకారం చూసుకుంటే బ్లాక్ బస్టర్ రేటింగ్ అనే చెప్పొచ్చు. అసలు సినిమా గురించి ఎవరికీ పెద్దగా తెలియక పోయినా మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత టెలికాస్ట్ లకు ఇంకా జోరు చూపే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here