Home న్యూస్ మిడిల్ క్లాస్ మెలోడీస్ రివ్యూ….హిట్టా ఫట్టా!!

మిడిల్ క్లాస్ మెలోడీస్ రివ్యూ….హిట్టా ఫట్టా!!

0

విజయ్ దేవర కొండ తమ్ముడు ఆనంద్ దేవర కొండ హీరోగా లాంచ్ అయిన దొరసాని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా తన రెండో ప్రయత్నంగా ఇప్పుడు మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా తో రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. ట్రైలర్ తో మెప్పించిన సినిమా ఎంత వరకు మెప్పించింది అన్న విశేషాలను ఒక సారి గమనిస్తే…

ముందుగా కథ పాయింట్ కి వస్తే… తండ్రి హోటల్ లోనే చిన్నప్పటి నుండి పని చేస్తూ పెద్దయ్యాక తనకంటూ ఒక హోటల్ పెట్టుకుని తన చేత్తో చేసే బొంబాయి చెట్నీని అందరికీ తినిపించాలని భావించే హీరో గుంటూరులో హోటల్ పెట్టాలని ట్రై చేస్తూ ఉంటాడు,

ముందు వద్దు అన్న ఫాదర్ తర్వాత కొడుకు హోటల్ కి హెల్ప్ చేస్తాడు కానీ ఎదో ఒక నష్టం వస్తూనే ఉంటుంది, ఎలాగోలా హోటల్ పెట్టాక పరిస్థితులు ఏమాత్రం కలిసి రావు…మరి హీరో చివరగా సెటిల్ అయ్యాడా లేదా, మధ్యలో హీరోయిన్ తన లవ్ స్టొరీ ఏంటి…. ఇతర పాత్రల సెకెండ్ స్టొరీలు అన్నీ కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

మిడిల్ క్లాస్ మెలోడీస్ అవడానికి హీరో హీరోయిన్స్, మరియు ఫాదర్ ల స్టొరీనే అయినా కానీ సెపరేట్ గా హీరో ఫ్రెండ్ ట్రాక్, ఆ ఫ్రెండ్ పెదనాన్న ట్రాక్, హీరో ఫ్రెండ్ లవ్ చేస్తున్న అమ్మాయి ట్రాక్, హీరోయిన్స్ పేరెంట్స్ ట్రాక్ ఇలా సెపరేట్ గా మరిన్ని ఉపకథలు సినిమాలో వస్తూ ఉంటాయి.

అన్నీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టొరీలే కాబట్టి ఎత్తుపల్లాల నడుమ లైఫ్ ఎలా ఉంటుంది లాంటి విశేషాలను డైరెక్టర్ ఉన్నంతలో బాగానే చూపెట్టాడు. హీరో ఆనంద్ దేవరకొండ ఓకే అనిపించే పెర్ఫార్మెన్స్ ఇవ్వగా మరింత మెరుగు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరోయిన్ వర్ష బొల్లమ్మ లుక్స్ అండ్ పెర్ఫార్మెన్స్….

సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి, ఇక హీరో ఫాదర్ రోల్ చాలా రియలిస్టిక్ గా ఉండటం తో హీరో పాత్ర కన్నా కూడా ఫాదర్ రోల్ తో ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవ్వడం ఖాయం, కొండలరావ్ రోల్ సినిమా అయ్యాక కూడా మనం గుర్తు పెట్టుకునేలా మెప్పిస్తుంది. ఇక ఇతర పాత్రలు చేసిన ప్రతీ ఒక్కరు, హీరో ఫ్రెండ్, ఫ్రెండ్ లవర్ రోల్, పాలు పోసే ముసలాయన…

ఇలా సైడ్ రోల్స్ చేసిన ప్రతీ ఒక్కరి పాత్ర కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది అని చెప్పాలి, సంగీతం పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి మ్యాచ్ అయ్యేలా బాగానే సెట్ అయ్యింది, డైలాగ్స్ బాగా రాశారు… స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ ఫస్టాఫ్ వరకు బాగున్నా…

సెకెండ్ ఆఫ్ లో రిపీటివ్ గా అనిపిస్తుంది, లెంత్ కూడా ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాటోగ్రఫీ బాగా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించాయి. ఇక డైరెక్షన్ పరంగా వినోద్ అనంతోజు ఎంచుకున్న పాయింట్ సైడ్ రోల్స్ అన్నీ బాగానే సెట్ అయినా కథలో పెద్దగా దమ్ము లేకుండా పోయింది.

సింపుల్ కథని పాత్రల ఎమోషన్స్ తో సినిమా మొత్తం నడిపించడం కష్టమే, ఆ విషయంలో డైరెక్టర్ చాలా వరకు మెప్పించాడు కానీ కథ కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తేనే సినిమా ఓవరాల్ గా మెప్పించ గలుగుతుంది, కానీ ఇక్కడ కథలో పెద్దగా ఇంపాక్ట్ లేకపోవడంతో ఉపకథలు అన్నీ మెప్పించినా మెయిన్ థీం మాత్రం ఎలివేట్ అవ్వలేదు,

కానీ ఇది పర్టిక్యులర్ గా కావాలని గమనిస్తే తప్పితే పెద్దగా ఇంపాక్ట్ చూపదు, సినిమా మొదలు అయిన కొద్ది సేపటికే సినిమాతో మనం కనెక్ట్ అవుతాం కొన్ని సీన్స్ బాగా మెప్పిస్తాయి, కొన్ని రిపీటివ్ గా అనిపిస్తాయి, అవి మరింత బాగా చూసుకుని ఉంటె సినిమా మరింత బాగా వచ్చి ఉండేది.

మొత్తం మీద సింపుల్ కథతో మంచి పెర్ఫార్మెన్స్ తోడుగా నిలిచిన ఈ సినిమా చాలా వరకు మెప్పించింది కానీ కథలో పెద్దగా దమ్ము లేకపోవడంతో ఇంపాక్ట్ అనుకున్న విధంగా రీచ్ కాలేదు, అయినా కానీ ఈజీగా ఒకసారి చూసే సినిమా ఇదని చెప్పొచ్చు. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here