Home న్యూస్ మిరాయ్ టీసర్ రివ్యూ….కుమ్మింది…లాస్ట్ షాట్ మెంటల్ మాస్!!

మిరాయ్ టీసర్ రివ్యూ….కుమ్మింది…లాస్ట్ షాట్ మెంటల్ మాస్!!

0

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర హనుమాన్ సినిమాతో ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) తర్వాత చాలానే ఆఫర్స్ రాగా వాటిలో బాగా ఎక్సైట్ చేసిన మిరాయ్(Mirai Movie) ని సెలెక్ట్ చేసుకోగా ఈ ఇయర్ సమ్మర్ లో రావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు…

పెండింగ్ వలన రిలీజ్ సెకెండ్ ఆఫ్ కి పోస్ట్ పోన్ అవ్వగా ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫాం చేస్తూ అఫీషియల్ టీసర్ ను కూడా రిలీజ్ చేశారు. టీసర్ చూసిన తర్వాత సినిమా మీద ఉన్న అంచనాలు అన్నీ కూడా హనుమాన్ మూవీ లానే భారీగా పెరిగిపోయాయి అని చెప్పాలి…

కథ పాయింట్ ని కూడా కొద్ది వరకు రివీల్ చేస్తూ అతీత శక్తులను సొంతం చేసుకున్న విలన్ ఎలా తన ఆదిపత్యాన్ని చూపించాలని చూస్తున్నాడు…ఈ క్రమంలో అందరినీ కాపాడటానికి సూపర్ యోధ అయిన హీరో మిరాయ్ అనే ఆయుధంతో ఏం చేశాడు…ఆ అడ్వెంచర్ ఏంటి అనేది అసలు కథగా…

టీసర్ లో చూపించారు…విజువల్స్ అన్నీ టాప్ నాట్చ్ అనిపించేలా ఉండగా గ్రాండియర్ ఎక్స్ లెంట్ గా మెప్పించింది అని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ నాట్చ్ అనిపించేలా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ టీసర్ ని పర్వాలేదు అనిపించేలా ఎలివేట్ చేసింది…

ఇక తేజ సజ్జ మరోసారి సూపర్ పవర్స్ తో మెప్పించబోతుండగా…మంచు మనోజ్ విలనిజం ఈ సారి హైలెట్ కాబోతుందని టీసర్ చూస్తుంటే అర్ధం అవుతుంది… ఇక టీసర్ లో అన్ని షాట్స్ ఒకెత్తు అయితే టీసర్ ఎండ్ లో శ్రీరాముడు అడుగులు వేస్తూ వస్తుంటే…

వానరాలు అన్నీ నమస్కారం చేస్తున్నట్లు చూపించిన షాట్ తో మరో లెవల్ కి వెళ్ళిపోయింది అని చెప్పాలి. హనుమాన్ టీసర్ ఎండ్ లో కూడా హనుమాన్ షాట్స్ ఓ రేంజ్ లో హైలెట్ అయ్యాయి. ఈ సారి ఈ షాట్స్ తో సినిమా మీద క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం ఉండగా సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here