ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో మెప్పించిన డైరెక్టర్ స్వరూప్ రెండో సినిమా మంచి స్టార్ కాస్ట్ తో వచ్చే ఛాన్స్ ఉన్నా మరో ప్రయత్నం చేయాలని డిసైడ్ అయ్యి ముగ్గురు చిన్న పిల్లలతో చేసిన ప్రయత్నం మిషన్ ఇంపాజిబుల్… ట్రైలర్ తో బాగా మెప్పించిన ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయింది. మరి ట్రైలర్ మెప్పించిన రేంజ్ లో సినిమా ఆకట్టుకుందో లేదో తెలుసుకుందాం పదండీ….
కథ పాయింట్ కి వస్తే… రఘుపతి రాఘవ రాజారాం అయిన ముగ్గురు పిల్లల ఏజ్ 12 ఏళ్ల లోపు ఏజ్ ఉన్న వీళ్ళు ఆ ఏజ్ కే డబ్బులు సంపాదించాలని, పేపర్ లో తమ ఫోటోలు పడాలి అని కళలు కంటూ ఉంటారు, అలాంటి టైం లో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకుని ప్రభుత్వం ఇచ్చే 50 లక్షల రివార్డు అని తెలిసి…
ఆ డాన్ ని పట్టుకోవాలని సిద్ధం అవుతారు, ఆ తర్వాత కథ ఏమయింది ఈ పిల్లలకి తాప్సీ ఎలా హెల్ప్ చేసింది అన్నది అసలు కథ… కథ పాయింట్ ఆసక్తి కరంగానే ఉండగా ఫస్టాఫ్ వరకు సినిమా పర్వాలేదు బాగుంది అనిపించేలా ఉంటుంది, సిల్లీ సీన్స్ వస్తున్నా కానీ చిన్న పిల్లల…
మైండ్ సెట్ ప్రకారం ఆలోచించి చూస్తె అవన్నీ నవ్వు తెప్పిస్తాయి, కానీ సెకెండ్ ఆఫ్ లో ఎక్కడో ఉన్న విలన్ దగ్గరకి పిల్లలు చేరుకున్న తర్వాత వచ్చే సీన్స్ అన్నీ కూడా అస్సలు లాజిక్ లు ఉండవు, మనకి పెద్దగా కనెక్ట్ కూడా అవ్వవు అనే చెప్పాలి. అయినా కానీ కొన్ని సీన్స్ ఆకట్టుకునేలా ఉండటం ముగ్గురు పిల్లలు బాగా నటించడం.. తాప్సీ కూడా మెప్పించడంతో…
కథలో ఫ్లాస్ ఎన్ని ఉన్నా కానీ ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది సినిమా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ డైరెక్టర్ కదా అని, మిషన్ ఇంపాజిబుల్ ట్రైలర్ బాగుంది కదా అని సినిమా కి వెళితే మట్టుకు కొద్దిగా నిరాశ చెందటం ఖాయం, ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే మట్టుకు కొంచం బోర్ కొట్టినా ఓవరాల్ గా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది ఈ సినిమా…