బాక్స్ ఆఫీస్ దగ్గర ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు కూడా మీడియం రేంజ్ మూవీస్ లో సాలిడ్ బజ్ ను సొంతం చేసుకున్న ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) రిలీజ్ అయిన తర్వాత మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి…
సొంతం చేసుకోగా సినిమా కి అడ్వాంటేజ్ గా 5 రోజుల లాంగ్ వీకెండ్ కలిసి వచ్చినా మిక్సుడ్ రెస్పాన్స్ వలన సినిమా తేరుకునే అవకాశం లేదని అందరూ అనుకున్నారు, కానీ సినిమా 4 రోజుల్లోనే సగం టార్గెట్ ను రికవరీ చేసి రామ్ నటించిన లాస్ట్ ఇయర్ మూవీ…
ది వారియర్ టోటల్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసేసింది… రెండు సినిమాలకు సిమిలర్ గానే టాక్ వచ్చినా కూడా ఇప్పుడు 5 రోజుల్లోనే సినిమా ఆల్ మోస్ట్ 28 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని అందుకోగా సినిమా 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో…
సగానికి పైగా కలెక్షన్స్ ని రికవరీ చేసింది… మిక్సుడ్ టాక్ తోనే ఆల్ మోస్ట్ 30 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ వైపు మీడియం రేంజ్ హీరో మూవీ కలెక్షన్స్ ని అందుకోవడం నిజంగానే అద్బుతం అని చెప్పాలి. అదే సినిమా కి బజ్ పాజిటివ్ గా ఉండి సినిమా రిలీజ్ అయిన తర్వాత…
పాజిటివ్ రెస్పాన్స్ ను కనుక సొంతం చేసుకుని ఉంటే ఈ కలెక్షన్స్ కి మించి అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఉండేది అని చెప్పాలి. కానీ సినిమాకి మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన ఎంత కుదిరితే అంత వెనక్కి తీసుకు రావాల్సిన అవసరం ఏర్పడగా సగానికి పైగా రికవరీ చేసిన సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.