బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమా అంటే టాక్ ఎలా ఉన్నా కానీ ఓపెనింగ్స్ మాత్రం కుమ్మేయడం ఖాయం, చాలా సినిమాలకు ఇది రుజువు అవ్వగా రీసెంట్ గా వచ్చిన సినిమాలకు ఆంధ్రలో పొలిటికల్ నేపధ్యంలో ఇబ్బందులు కొద్ది వరకు రాగా…
కోవిడ్ కూడా ఇబ్బంది పెట్టడంతో కలెక్షన్స్ పై ఆ ఇబ్బంది పడింది , కానీ రీసెంట్ గా వచ్చిన బ్రో మూవీ(BRO The Avatar) కి పొలిటికల్ గా ఇబ్బందులు లేకుండా నార్మల్ టికెట్ రేట్స్ తోనే ఆడియన్స్ ముందుకు వచ్చినా కూడా సినిమా కి వర్షాల వలన…
ఇబ్బందులు నైజాంలో జిల్లాలలో ఎఫెక్ట్ చూపించింది, ఆంధ్రలో లో టికెట్ రేట్స్, బెనిఫిట్ షోలు లేక పోవడం లాంటివి ఓపెనింగ్ పై ఇంపాక్ట్ చూపించగా సినిమాకి కూడా ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. కొందరికి సినిమా నచ్చినా కొందరికి మాత్రం….
యావరేజ్ గా అనిపించింది. ఇవన్నీ ఫేస్ చేస్తూ సినిమా వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ నే పోస్ట్ చేయగా…మిక్సుడ్ టాక్, పవన్ స్పెషల్ రోల్, క్లాస్ మూవీ ఇలా అనేక పాయింట్స్ ఉన్నప్పటికీ సినిమాకి కలెక్షన్స్ బాగానే రాగా…అదే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే…
కలెక్షన్స్ పరంగా మరింత జోరు చూపించి బిజినెస్ లో ఇంకా చాలా మొత్తాన్ని మొదటి వీకెండ్ లోనే అందుకునేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. రీమేక్స్ తోనే సాలిడ్ గా కుమ్మేసే ఓపెనింగ్స్ ని అందుకున్న పవన్ కళ్యాణ్ ఇక అప్ కమింగ్ మూవీ అయిన OG తో ఏమాత్రం టాక్ పాజిటివ్ గా వచ్చినా కలెక్షన్స్ తో కుమ్మేయడం ఖాయమని చెప్పొచ్చు.