Home న్యూస్ నా మీద ట్రోలింగ్ వెనుక ఆ’ఇద్దరు’ హీరోలు…..100 మంది టీం కూడా-మోహన్ బాబు!!

నా మీద ట్రోలింగ్ వెనుక ఆ’ఇద్దరు’ హీరోలు…..100 మంది టీం కూడా-మోహన్ బాబు!!

0

సీనియర్ యాక్టర్ మంచు మోహన్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి సిద్ధం అయింది. కాగా సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 350 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చెసుకొబోతుండగా సినిమా కి అడ్వాన్స్ బుకింగ్స్ ఏమి జరగక పోవడంతో ఇక మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అయిన సినిమాను ఆడియన్స్ ఎలా ఆదరిస్తారు….

అన్నది ఆసక్తిగా మారగా సినిమాను ప్రమోట్ చేయడం మొదలు పెట్టగా మోహన్ బాబు మాట్లాడు సినిమా గురించి పలు విషయాలు చెప్పడంతో పాటు తన పై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై కూడా మాట్లాడు కొన్ని ఆశ్యర్యకరమైన కామెంట్స్ చేశారు…

‘‘సోషల్‌మీడియాలో వచ్చే ట్రోలింగ్స్‌ని తెలిసిన వాళ్లు అప్పుడప్పుడూ నాకు పంపిస్తుంటారు. ఒక్కొసారి వాటిని చూసినప్పుడు కాస్త బాధగా అనిపిస్తుంటుంది. ట్రోల్స్‌ అంటే.. నవ్వించేలా ఉండాలి కానీ, అసభ్యకరంగా ఉండకూడదు. ఓ ఇద్దరు హీరోలు.. యాబై నుంచి వంద మందిని ప్రత్యేకంగా నియ‌మించుకుని మరీ నన్ను ట్రోల్ చేయిస్తున్నారు. ఆ హీరోలు ఎవరో నాకు బాగా తెలుసు. ట్రోల్స్‌ చేయించేవాళ్లు తాత్కాలికంగా ఆనందం పొందవచ్చు. కానీ, ఏదో ఒక సమయంలో వాళ్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు’’ అని మోహన్‌బాబు వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here