మంచు విష్ణు కాజల్ ల కాంబినేషన్ లో హాలీవుడ్ డైరెక్టర్ ని పెట్టుకుని ఏకంగా 50 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో రూపొందించిన లేటెస్ట్ మూవీ మోసగాళ్ళు. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా తీవ్ర నిరాశని మిగిలించిన విషయం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా రూపొందిన ఈ సినిమా ఇతర భాషల్లో కూడా భారీ నష్టలనే మిగిలించింది అని చెప్పాలి.
కానీ మొత్తం మీద 50 కోట్ల బడ్జెట్ కి ఓవరాల్ గా అన్ని భాషల్లో కలిపి 30 కోట్ల మేర నాన్ థియేట్రికల్ రైట్స్ కింద రికవరీ ని సొంతం చేసుకుంది, కానీ అంత మొత్తం ఎక్కడ నుండి రికవరీ అయ్యింది అన్నది ఆసక్తిగా మారగా అందులో ఒక్క హిందీ నుండే సినిమా కి…
సాలిడ్ గా 10.20 కోట్ల మేర రికవరీ అయిందట. సినిమాలో కీలక పాత్ర పోషించిన సునీల్ శెట్టి తన రిఫరెన్సులు వాడి ఈ సినిమా కి అంత బిజినెస్ జరిగేలా చూశాడు అని టాక్ ఉంది. హిందీ డబ్బింగ్ రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్ ఈ రేంజ్ రేటు పెద్ద హీరోల మూవీస్ లేదా…
మీడియం రేంజ్ హీరోల మూవీస్ అక్కడ యూట్యూబ్ లో సాలిడ్ వ్యూస్ వస్తేనే ఇస్తూ ఉంటారు, అలాంటిది ఈ సినిమాతో అంత రేటు అక్కడ సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. కానీ అదే సమయం లో హిందీ డబ్ వర్షన్ ను సుమారు 150 స్క్రీన్స్ లో రిలీజ్ చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ షేర్ ని కూడా…
సాధించలేక పోయింది, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ఇలా తెలిసిన వాళ్ళు ఉన్నా బాలీవుడ్ వాళ్ళు ఈ సినిమా పట్టించుకొనే లేదు, అక్కడ లోకల్ మీడియం రేంజ్ మూవీస్ నే ఇప్పుడు పట్టించుకోవడం లేదు, అలాంటిది ఈ డబ్ మూవీ ని పట్టించుకుంటారు అనుకోవడం కూడా తప్పే… దాంతో జీరో షేర్ ని హిందీ లో సొంతం చేసుకుని డిసాస్టర్ అయింది ఈ సినిమా..