Home న్యూస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ టాక్…ఎలా ఉందంటే!!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ టాక్…ఎలా ఉందంటే!!

1178
0

అక్కినేని అఖిల్ బాక్స్ అఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టి చాలా టైం అవుతున్నా ఇంకా మొదటి హిట్ ని అందుకోవాల్సి ఉంది, కెరీర్ ని 6 ఏళ్ల క్రితమే మొదలు పెట్టినా ఇప్పటి వరకు 3 సినిమాలే చేసిన అఖిల్ ఇప్పుడు నాలుగో సినిమాగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు, అక్టోబర్ 15 న రిలీజ్ కానున్న ఈ సినిమా…

థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ చూస్తుంటే ప్రామిసింగ్ గానే కనిపిస్తుంది అని చెప్పాలి…. ఇద్దరు డిఫెరెంట్ మైండ్ సెట్ కలిగిన హీరో హీరోయిన్స్ లైఫ్ లో ఎలా కలిసారు కలిసాక వాళ్ళ లైఫ్ లో వచ్చిన మార్పులు ఏంటి అనేది ఓవరాల్ గా….

సినిమా స్టొరీ పాయింట్ లా ట్రైలర్ చూస్తె అర్ధం అవుతుంది, లైఫ్ పార్టనర్ తో లైఫ్ ని ఎంతో అందంగా ఊహించుకునే హీరోయిన్, లైఫ్ అంటే సగం కెరీర్ అలాగే సగం మ్యారేజ్ అనుకునే హీరో ల లైఫ్ లో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చాయి అన్నది సినిమా లో చూపెట్టబోతున్నాడు బొమ్మరిల్లు భాస్కర్…

ట్రైలర్ వరకు మరీ అద్బుతం కాదు కానీ ఇనీషియల్ ఇంప్రెషన్స్ వరకు బాగానే ఉందనిపించింది. అది సినిమాగా చూస్తె మరింత బాగుండే ఛాన్స్ ఉంది, ఇక అఖిల్ పలు గెటప్స్ లో ఆకట్టుకోవడమే కాదు యాక్టింగ్ పరంగా కూడా ఇంప్రూవ్ అయ్యాడని ట్రైలర్ లో అనిపించింది, పూజా రెగ్యులర్ మూవీస్ లో మారిగానే అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకోగా భారీ స్టార్ కాస్ట్ అండ్…

గ్రాండియర్ ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. చాలా టైం తర్వాత డైరెక్షన్ చేస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ ట్రైలర్ వరకు ఇంప్రెస్ చేశాడు కానీ కొంచం కాంప్లికేటెడ్ స్టొరీనే ఎంచుకున్నాడు అనిపిస్తుంది, మరి థియేటర్స్ లో ఎంతవరకు అంచనాలను అందుకుంటాడో, తను కంబ్యాక్ ఇవ్వడమే కాదు అఖిల్ కి ఫస్ట్ హిట్ ఇస్తాడో లేదో 15 న తేలనుంది. ఇక ట్రైలర్ కి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here