పైరసీ మాయ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే కొత్త సినిమా రిలీజ్ అయిన సాయంత్రాని కే పైరసీ ప్రింట్ ఆన్ లైన్ అందరికీ అందుబాటులో ఉంటూ వస్తుండగా ఇప్పుడు కొత్త సినిమాలు అన్నీ కూడా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ఇలా అఫీషియల్ గా రిలీజ్ అవుతున్నాయో లేదో కొంత సేపటికే పైరసీ సైట్స్ లో ఆ సినిమాలు ప్రత్యక్షం అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం.
కానీ లేటెస్ట్ గా డైరెక్ట్ రిలీజ్ అవుతున్న ఓ క్రేజీ డబ్బింగ్ మూవీ రిలీజ్ అవ్వడానికి 3 రోజుల ముందే ఆన్ లైన్ లో మాస్టర్ ప్రింట్ లీక్ అవ్వడం జరిగింది… కేరళలో వ్యాపించిన నిఫా వైరస్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, ఆ వైరస్ పై మంచి స్టార్ కాస్ట్ తో…
చేసిన సినిమా వైరస్ కి మంచి అప్లాజ్ లభించగా ఆ సినిమాను తెలుగు లో ఆహా వీడియో యాప్ ద్వారా డైరెక్ట్ రిలీజ్ ను డిసెంబర్ 4 న చేయబోతున్నాం అని అనౌన్స్ చేశారు. ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా సినిమా గురించి తెలుసుకున్న వాళ్ళు ఆసక్తిగా సినిమా కోసం ఇప్పుడు…
ఎదురు చూడటం మొదలు పెట్టగా ఇంతలో డిసెంబర్ 1 నే సినిమా తెలుగు వర్షన్ మాస్టర్ ప్రింట్ ఆన్ లైన్ లో లీక్ అయ్యింది, ఎలా లీక్ అయ్యిందో తెలియదు కానీ పైరసీ సైట్స్ అన్నింటిలో సినిమా అప్లోడ్ అవ్వడం తో అలా ఎలా జరిగింది అంటూ ఇప్పుడు ఆరా తీయడం మొదలు పెట్టారు యూనిట్ వాళ్ళు.
పైరసీ ఏ రేంజ్ లో దెబ్బ కొడుతుందో అందరికీ తెలిసిందే, సినిమా ను డీసెంట్ రేటు పెట్టి కొన్న ఆహా వీడియో వాళ్ళు ఇప్పుడు దీనివల్ల కొన్ని వేల లేదా లక్షల యూనిక్ వ్యూస్ ని కోల్పోయే అవకాశం ఉంటుంది, మరి ఇది ఎవరు చేశారో ఎలా కనిపెడతారో చూడాలి మరి…