Home న్యూస్ మిస్టర్ బచ్చన్ షో రీల్ రివ్యూ…రవితేజ మాస్ కంబ్యాక్ కన్ఫాం!

మిస్టర్ బచ్చన్ షో రీల్ రివ్యూ…రవితేజ మాస్ కంబ్యాక్ కన్ఫాం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) రీసెంట్ టైంలో మళ్ళీ వరుసగా నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకుంటూ ఉండగా ఇలాంటి టైంలో మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ ఇప్పుడు మాస్ అండ్ రీమేక్ మూవీస్ ని బాగా హ్యాండిల్ చేస్తాడు అన్న పేరున్న హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న కొత్త సినిమా…

మిస్టర్ బచ్చన్(Mr.Bachchan Movie) తో త్వరలో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా హిందీలో మంచి హిట్ గా నిలిచిన రైడ్ మూవీకి తెలుగు వర్షన్ గా రాబోతుంది. కాగా సినిమా అఫీషియల్ షో రీల్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఎలాంటి డైలాగ్స్ ఏమి లేకుండా రిలీజ్ చేసిన ఈ షో రీల్ లో…

మాస్ ఎలిమెంట్స్ ని, యాక్షన్ సీన్స్ ని ఎక్కువగా హైలెట్ చేశారు, రవితేజ లుక్స్ ఎక్స్ లెంట్ గా ఉండగా కొన్ని షాట్స్, ఎలివేషన్స్ బాగా సెట్ అయ్యాయి. ఒక్క డైలాగ్ అయినా పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది, బ్యాగ్రౌండ్ స్కోర్ ఓకే అనిపించేలా ఉన్నాయి…ఇక సినిమా ఆడియన్స్ ముందుకు ఎప్పుడు వస్తుంది అన్నది…

ఇంకా క్లారిటీ లేదు కానీ ఆగస్టు లో లేదా సెప్టెంబర్లో రిలీజ్ కి అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ సారి మంచి కంటెంట్ తోనే రాబోతున్న రవితేజ మిరపకాయ్ లాంటి మంచి హిట్ కొట్టిన కాంబోలో వస్తున్న సినిమా అవ్వడంతో ఈ సారి రవితేజకి మంచి కంబ్యాక్ గా ఈ సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here