Home న్యూస్ తొలి 2 సినిమాలను మించిన 3 వ సినిమా…ఇండస్ట్రీ మొత్తం షాక్!

తొలి 2 సినిమాలను మించిన 3 వ సినిమా…ఇండస్ట్రీ మొత్తం షాక్!

1037
0

    పాపం అఖిల్ కి కాలం అస్సలు కలిసి రావడం లేదు, కెరీర్ లో తొలి సినిమాతో సెన్సేషనల్ రికార్డులను తిరగ రాయాలి అనుకున్నా ఆ సినిమా ఫలితం నిరాశని మిగిలించగా రూట్ మార్చి పూర్తీ లవ్ స్టొరీ తో హలో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ కి ఆ సినిమా పోటి లో రిలీజ్ అవ్వడం కమర్షియల్ ఎలిమెంట్స్ లేక పోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో సారి…

నిరాశ మిగిలింది… ఇక ఇప్పుడు లవ్ స్టొరీ తో కొంచం కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ప్రేక్షకుల ముందుకు మిస్టర్ మజ్ను అంటూ వచ్చిన అఖిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ నే సొంతం చేసుకోవడం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అందుకునే రేంజ్ లోనే…

ఉండటం తో కచ్చితంగా తొలి కమర్షియల్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడు అని అంతా భావించారు, కానీ అందరికీ షాక్ ఇస్తూ మిస్టర్ మజ్ను అఖిల్ కెరీర్ లో మూడో ఫ్లాఫ్ గా మిగిలింది, ఫ్లాఫ్ కూడా కాదు డిసాస్టర్ రేంజ్ లో నిలిచే ప్రదర్శన ని కనబరిచింది ఈ సినిమా.

మొదటి రెండు సినిమాలు బిజినెస్ ఎక్కువ, పోటి వలన దెబ్బ తిన్నా ఈ సారి పోటి లేని సమయం లో అందుకోగల బిజినెస్ టార్గెట్ తోనే వచ్చినా కానీ ప్రేక్షకుల నుండి స్పందన అనుకున్న రేంజ్ లో లేకపోవడం తో సినిమా 11 రోజుల్లో టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…

కేవలం 11.3 కోట్ల లోపే షేర్ ని అందుకోగా టోటల్ రన్ లో ఇప్పుడు సినిమా 12 కోట్ల లోపు కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ పరుగును ఆపేలా కనిపిస్తుంది, దాంతో బిజినెస్ 22 కోట్ల లో 10 కోట్ల రేంజ్ లో లాస్ ని సొంతం చేసుకుని డిసాస్టర్ గా మిగిలి పోబోతుంది మిస్టర్ మజ్ను సినిమా… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!