బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 15 వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు మంచి క్రేజ్ నడుమ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి…మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) అలాగే ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) లు నటించిన కొత్త సినిమాలు మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) మరియు డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie) సినిమాలు…
రెండూ కూడా ఒకటికి మించి ఒకటి డిసాస్టర్ టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా…బెస్ట్ వీకెండ్ లో ఏమాత్రం ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించలేక ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని హ్యుమంగస్ లాసులను కూడా దక్కించుకున్నాయి…
ఈ సినిమాల రిజల్ట్ ల ఇంపాక్ట్ ఇప్పుడు మరో సినిమా కాన్సిల్ అయ్యేలా చేసింది అనేది లేటెస్ట్ గా టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా వినిపిస్తున్న వార్తా…మిస్టర్ బచ్చన్ ను డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ ప్రెస్ మీట్స్ లో ఇంటర్వ్యూలతో సినిమా మీద కొంచం ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండటం…
సినిమా ఆ రేంజ్ కి అస్సలు వెల్ల లేకపోవడంతో ఓ రేంజ్ లో ట్రోల్స్ పడ్డాయి….ఆ ఇంపాక్ట్ వలన హరీష్ శంకర్ తర్వాత సినిమా చేసే అవకాశం ఉన్న రామ్ పోతినేని కూడా డబుల్ ఇస్మార్ట్ తో ఎపిక్ డిసాస్టర్ ను అందుకోవడంతో ఇప్పుడు హరీష్ శంకర్ తో చేయడానికి ఏమాత్రం సిద్ధంగా లేని పరిస్థితి నెలకొనగా….
వీళ్ళ కాంబోలో సినిమా ఉంటుంది అంటూ రిలీజ్ కి ముందు చెప్పినా కూడా ఇప్పుడు వీళ్ళ కాంబో సినిమా ఏమాత్రం సెట్ అయ్యే అవకాశం లేనట్టే అని అంటున్నారు. రామ్ కి ఇప్పుడు బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత ఓ సాలిడ్ కంబ్యాక్ అవసరం కాబట్టి మరో డైరెక్టర్ వేటలో ఉన్నాడని అంటున్నారు. ఇక హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ కి జరిగిన తప్పులు ఉస్తాద్ భగత్ సింగ్ లో జరగకుండా చూసుకునే పనిలో ఉన్నాడని సమాచారం….