బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) ధమాకా(Dhamaka) లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన లేటెస్ట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి…రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు మరియు ఈగల్ మూవీస్ వరుసగా రిలీజ్ అయ్యి అన్నీ నిరాశ కలిగించే రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి…
ఇలాంటి టైంలో రవితేజ తనకి మిరపకాయ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి చేస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) ఆడియన్స్ ముందుకు ఆగస్టు 15న రిలీజ్ కి సిద్ధం అవ్వగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ రిలీజ్ అవ్వగా…
ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా సినిమా బిజినెస్ కూడా యమ స్పీడ్ గా సాగుతూ ఉండటం విశేషం అని చెప్పాలి…కాగా లేటెస్ట్ గా సినిమా నైజాం ఏరియాలో టోటల్ బిజినెస్ ను కంప్లీట్ చేసుకోగా వరుస ఫ్లాఫ్స్ పడ్డా కూడా సూపర్ హిట్ కాంబినేషన్ లో మూవీ అవ్వడం..
అలాగే లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో పోటి ఉన్నా కూడా ఒక్క నైజాం ఏరియాలోనే సినిమాకి ఏకంగా 15 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు సొంతం అయ్యి అందరినీ ఆశ్యర్య పరిచింది….కాగా ఈ మొత్తంలో ఒకవేళ సినిమా కనుక టార్గెట్ ను అందుకోక పొతే మేకర్స్…
కొన్న డిస్ట్రిబ్యూటర్ కి రేటులో 2.5 కోట్ల మేర రిటర్న్ ఇచ్చే అగ్రిమెంట్ తో రేటుని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా ఈ రేంజ్ లో బిజినెస్ సొంతం అవ్వడం అంటే మామూలు విషయం కాదు. సినిమా మీద బజ్ డీసెంట్ గా ఉండటంతో…
సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం అంచనాలను అందుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ టార్గెట్ ను లాంగ్ వీకెండ్ లో రికవరీ చేయడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇతర సినిమాల మధ్య పోటిలో మిస్టర్ బచ్చన్ మూవీతో రవితేజ ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.