బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన రీసెంట్ మూవీస్ అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతూ వస్తూ ఉండగా లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) బడ్జెట్ పరంగా భారీ బడ్జెట్ తో తెరకేక్కినా ఓపెనింగ్స్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది…
దానికి తోడూ రిలీజ్ అయిన మొదటి ఆటకే ఎక్స్ ట్రీం లెవల్ లో నెగటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం తేరుకోలేక పోయింది…దానికి తోడూ సోషల్ మీడియా లో సినిమా మీద విపరీతమైన ట్రోల్స్ పడగా…
డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాను, తననూ ట్రోల్ చేస్తున్న వాళ్ళందరినీ బ్లాక్ చేస్తూ పోతున్నాడు…మరో పక్క సినిమా టాక్ అంతటా స్ప్రెడ్ అవ్వడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో రెండో రోజే సినిమాలో హైలెట్ అవుతాయి అనుకున్నా జనాలను ఏమాత్రం ఆకట్టుకోలేని హిందీ సాంగ్స్…
డిలేట్ చేస్తూ ఆల్ మోస్ట్ 13 నిమిషాల రన్ టైంని తగ్గించామని, ఎడిటింగ్ లో కూడా కొన్ని మార్పులు చేశాం అంటూ రెండో రోజే పోస్టర్ ను రిలీజ్ చేసి అప్ డేట్ చేశారు….రవితేజ నటించిన సినిమాల్లో ఏడాది టైంలో ఇలా రెండో సారి ట్రిమ్ అయిన మిస్టర్ బచ్చన్…
ఇది వరకు లాస్ట్ ఇయర్ దసరా టైంలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు రన్ టైం మరీ ఎక్కువగా ఉండటం బెడదికొట్టగా ఆ సినిమాను వీకెండ్ లోపే ఆల్ మోస్ట్ 24 నిమిషాలకు పైగా డిలేట్ చేశారు…ఏడాది గ్యాప్ లో ఇప్పుడు మరోసారి మిస్టర్ బచ్చన్ మూవీ విషయంలో ఇది జరిగింది.
రవితేజ కూడా ఒకప్పుడు చేసినంత ఫోకస్ సినిమాల మీద చేయడం లేదేమో అని ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు…ఇలా నాసిరకం సినిమాలు ఎన్ని వచ్చినా మాస్ లో తన క్రేజ్ తగ్గదు కానీ ఇవే చేస్తూ పోతే వాళ్ళు కూడా ఇక థియేటర్స్ కి వచ్చి చూసే పరిస్థితి తగ్గిపోయే ప్రమాదం కూడా లేక పోలేదు.
ఇక రెండో రోజే ట్రిమ్ అయిన మిస్టర్ బచ్చన్ మూవీ ఈ వీకెండ్ లో ఎంతవరకు జనాలను థియేటర్స్ కి రప్పించి బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో ఎంతవరకు రికవరీని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు…తేరుకోకపోతే మట్టుకు భారీ నష్టాలు ఖాయమని చెప్పొచ్చు.