బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకున్న మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఏమాత్రం ఆడియన్స్ ను మెప్పించ లేక పోయింది…దాంతో కలెక్షన్స్ పరంగా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించ లేక పోతున్న ఈ సినిమా రెండో రోజు అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగా డ్రాప్స్ ను అందుకోగా…
మూడో రోజు నుండి వీకెండ్ స్టార్ట్ అవ్వడం, అలాగే మేకర్స్ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడానికి సినిమాలో బోర్ అనిపించే సీన్స్ ను ట్రిమ్ చేశామని అనౌన్స్ చేయడంతో వీకెండ్ లో ఏమైనా గ్రోత్ ఉంటుందేమో అనుకున్నా కూడా ఆన్ లైన్ బుకింగ్స్ చూస్తుంటే ఎలాంటి గ్రోత్ అయితే కనిపించడం లేదు సరికాదా…
కొన్ని చోట్ల బుకింగ్స్ డే 2 కన్నా కూడా తగ్గుతూ ఉన్నాయి ఇప్పుడు…దాంతో ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే మూడో రోజు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఏమైనా గ్రోత్ ఉంటే తప్పితే ఆల్ మోస్ట్ రెండో రోజు లెవల్ లో సినిమా 75-80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపొతే ఈ షేర్ పెరిగే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా కూడా 90 లక్షల లోపే షేర్ ని 3వ రోజున సినిమా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు…సినిమాలో బోర్ సీన్స్ ను ట్రిమ్ చేసినా కూడా ఆల్ రెడీ సినిమా టాక్ అంతటా స్ప్రెడ్ అవ్వడం కలెక్షన్స్ పై ఇప్పుడు…
గట్టి ఇంపాక్ట్ నే చూపించబోతూ ఉండగా ఏమైనా అద్బుతం జరిగితే తప్పితే మిస్టర్ బచ్చన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకునే అవకాశమే లేదని చెప్పాలి ఇప్పుడు. ఇక మొత్తం మీద మూడో రోజు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో ఏమైనా గ్రోత్ చూపించి అనుకున్న దాని కన్నా కొంచం బెటర్ గా అయినా సినిమా వసూళ్ళని సాధిస్తుందో లేదో చూడాలి ఇప్పుడు.