మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) కి ఇప్పుడు ఓ సాలిడ్ కంబ్యాక్ అవసరం…మూడు వరుస ఫ్లాఫ్స్ తర్వాత వస్తున్న రవితేజ లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr Bachchan) సినిమా, రవితేజ హరీష్ శంకర్ ల కాంబోలో మిరపకాయ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కాగా ఆల్ రెడీ హిందీలో హిట్ అయిన రైడ్ మూవీకి రీమేక్ గా వస్తున్నా…
తెలుగులో కమర్షియల్ ఎలిమెంట్స్ ను భారీగానే జోడించి రూపొందించిన ఈ సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకోగా యు/ఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకోగా అక్కడ నుండి ఫస్ట్ టాక్ ఏంటో కూడా బయటికి వచ్చేసింది. ఆ టాక్ ప్రకారం రవితేజకి సినిమా మంచి కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు…
కథ పాయింట్ ఒరిజినల్ లో ఉన్నది కోర్ పాయింట్ అయినా ఫస్టాఫ్ లో హీరో పెర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా చూపించారని, హీరోయిన్ తో లవ్ స్టోరీ.. హీరోయిన్ తో పెళ్లికి ఏర్పడే కష్టాలు…అదే టైంలో విలన్ ఇంట్లోకి ఇంకం టాక్స్ ఆఫీసర్ అయిన హీరో వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడు…
అన్న కాన్సెప్ట్ తో రూపొందిన మిస్టర్ బచ్చన్ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో బాగానే ఇంప్రెస్ చేసిందని అంటున్నారు..రవితేజ నుండి కోరుకునే కామెడీ, యాక్షన్ అండ్ హీరోయిజం ఎలివేట్ సీన్స్ తో నిండిపోయిన మిస్టర్ బచ్చన్ కథ పాయింట్ స్క్రీన్ ప్లే కొంచం ఈజీగా గెస్ చేసేలానే ఉందని అంటూ ఉండగా…
అక్కడక్కడా కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించినా కూడా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్ చాలా సినిమాలో ఉండటంతో మొత్తం మీద ఫస్టాఫ్ ఎబో యావరేజ్ గా సెకెండ్ ఆఫ్ కూడా ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించిందని….ధమాకా తర్వాత రవితేజ సినిమాల్లో మిస్ అయిన…
ఎంటర్ టైన్ మెంట్ అండ్ గుడ్ మ్యూజిక్ ఈ సినిమాలో ఉండటం అలాగే హీరోయిజం ఎలివేట్ సీన్స్ బాగానే పడటం, హీరో విలన్ ల మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగే సీన్స్ బాగా రావడంతో ఓవరాల్ గా రవితేజకి కంబ్యాక్ మూవీగా నిలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు…
మొత్తం మీద సెన్సార్ రిపోర్ట్ లు పాజిటివ్ గానే ఉంటాయి కానీ ఆల్ రెడీ హిట్ అయిన సబ్జెక్ట్ కి మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి రూపొందించిన మిస్టర్ బచ్చన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుండి ఇదే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకునే రవితేజకి సాలిడ్ కంబ్యాక్ ఇక పక్కా అని అనుకోవచ్చు. చూడాలి ఇక ఏం జరుగుతుందో….