Home న్యూస్ క్రేజ్ తగ్గని రవితేజ మాస్…మిస్టర్ బచ్చన్ కి సాలిడ్ OTT రేటు!

క్రేజ్ తగ్గని రవితేజ మాస్…మిస్టర్ బచ్చన్ కి సాలిడ్ OTT రేటు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) ధమాకా(Dhamaka Movie) లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయాయి… ఇలాంటి టైంలో రవితేజ తనతో మిరపకాయ్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన హరీష్ శంకర్ తో చేస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie)….

సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడగా సినిమా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా పోటిలో ఇతర బిగ్ మూవీస్ కూడా ఉండగా ఓటిటి అగ్రిమెంట్ ల వలన మిస్టర్ బచ్చన్ సినిమాను…

ఆగస్టు15న రిలీజ్ ను అనౌన్స్ చేయగా ఓటిటి బిజినెస్ పరంగా కూడా సాలిడ్ రేటుని సొంతం చేసుకున్న మిస్టర్ బచ్చన్ ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా రవితేజ సినిమాల క్రేజ్ ఇంకా తగ్గలేదు అని నిరూపించి మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు..

నెట్ ఫ్లిక్స్ వాళ్ళు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సాలిడ్ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారట. ఆల్ మోస్ట్ రేటు 19.50 కోట్ల నుండి 20 కోట్ల మధ్యలో ఫైనల్ అయ్యిందని తెలుస్తూ ఉంది. ఒక్క డిజిటల్ రైట్స్ కే ఈ రేంజ్ లో రేటుని సొంతం చేసుకున్న మిస్టర్ బచ్చన్ మూవీ…

ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ సాలిడ్ రేటుకే జరిగింది అంటున్నారు. సినిమా బడ్జెట్ కొంచం అంచనాలు మించింది అని అంటూ ఉండగా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రేట్స్ తో చాలా వరకు రికవరీ అయ్యిందని అంటున్నారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఆగస్టు 15న ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది, ఎలాంటి వసూళ్ళని అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here