OTT లో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల్లో బాగా హైప్ ని సొంతం చేసుకున్న సినిమా డర్టీ హరి. సినిమా కంటెంట్ యూత్ ని టార్గెట్ చేసి ఉండటం తో సహజంగానే సినిమా పై ఎక్కువ ఫోకస్ ఏర్పడింది. దాంతో సినిమా ని బాగా ప్రమోట్ చేసి కొత్తగా లాంచ్ చేసిన పే పెర్ వ్యూ పద్దతిలో సినిమాను 120 టికెట్ రేటు తో రిలీజ్ చేయగా సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా ను…
వారానికి పైగా పే పెర్ వ్యూ పద్దతిలో ఆడియన్స్ కి అందుబాటులో ఉంచగా 5 రోజుల్లో సినిమా కి 2 లక్షల 10 వేల దాకా వ్యూస్ సొంతం అవ్వగా తర్వాత మిగిలిన రోజుల్లో మరో 35 వేల యూనిక్ వ్యూస్ సినిమా కి సొంతం అయ్యాయి. దాంతో టోటల్ గా సినిమా పే పెర్ వ్యూ పద్దతిలో…
2 లక్షల 45 వేల యూనిక్ వ్యూస్ ని 120 టికెట్ రేటు తో సొంతం చేసుకోగా టోటల్ కలెక్షన్స్ 2.94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించినట్లు అంచనా… ఇక సినిమా టోటల్ బడ్జెట్ పబ్లిసిటీ తో కలిపి 2 కోట్లు కాగా ఇక్కడే సినిమా కి మంచి ప్రాఫిట్ లు లభించగా… సినిమా ను ఆహా యాప్ కి…
డిజిటల్ రిలీజ్ లో భాగంగా సాలిడ్ రేటు కి అమ్మేశారు. మొత్తం మీద 2.6 కోట్ల రేటు కి సినిమాను ఆహా యాప్ లో అమ్మినట్లు సమాచారం. దాంతో సినిమా బడ్జెట్ 2 కోట్లు అయితే సినిమా మొత్తం మీద అల్టిమేట్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. 2.94 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ లో 20% యాప్ వాళ్లకి మిగిలినవి సినిమా నిర్మాతలకి వెళుతుంది. అంటే మొత్తం అమౌంట్ లో…
నిర్మాట్లాకు 2.3 కోట్లకు పైగా రికవరీ అవ్వగా ఇప్పుడు డిజిటల్ రైట్స్ తో 2.6 కోట్లు దక్కాయి. దాంతో బడ్జెట్ మీద ఇప్పటికే నిర్మాతలకి సినిమా ద్వారా 4.9 కోట్ల టోటల్ రెవెన్యూ దక్కగా ప్రాఫిట్ ఇక్కడే 2.9 కోట్లు దక్కింది. ఇక తెలుగు శాటిలైట్ రైట్స్ అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ బాలెన్స్ ఉన్నాయి వాటితో మరింత ప్రాఫిట్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.