Home టోటల్ కలెక్షన్స్ 30 కోట్ల బడ్జెట్…2000 స్క్రీన్స్ లో రిలీజ్…వచ్చిన కలెక్షన్స్ తెలిస్తే షాకే!!

30 కోట్ల బడ్జెట్…2000 స్క్రీన్స్ లో రిలీజ్…వచ్చిన కలెక్షన్స్ తెలిస్తే షాకే!!

3297
0

పాండమిక్ తర్వాత ఇండియా లో టాలీవుడ్ కోలివుడ్ లు బాగానే కోలుకోగా తర్వాత కన్నడ మరియు మలయాళ ఇండస్ట్రీలు కూడా ఎంతో కొంత కోలుకున్నాయి కానీ బాలీవుడ్ మాత్రం ఏడాది నుండి మూత బడే ఉంది, బాక్స్ ఆఫీస్ దగ్గర వాళ్లకి పాండమిక్ తర్వాత ఫస్ట్ హిట్ ఇంకా దక్కనే లేదు… కానీ కొత్త సినిమాలు రిలీజ్ లు అవుతూ ఉన్న నేపధ్యంలో మళ్ళీ సెకెండ్ వేవ్ ఇంపాక్ట్ వలన అన్ని సినిమాల…

రిలీజ్ లు ఆగిపోయాయి… దాంతో ఇప్పటిలో బాలీవుడ్ తేరుకునే అవకాశమే లేదని అంతా భావిస్తున్నారు. ఇక బాలీవుడ్ నుండి లాస్ట్ బిగ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమా ముంబై సగా… జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మీ ల కాంబినేషన్ లో కాజల్ అగర్వాల్…

హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఆల్ మోస్ట్ 30 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించగా ఇండియా లో సుమారు 2000 వరకు స్క్రీన్స్ లో గ్రాండ్ రిలీజ్ నే సొంతం చేసుకుంది ఈ సినిమా. కానీ సినిమా బిలో యావరేజ్ టాక్ రావాడం తో ఓపెనింగ్స్ లభించినా కానీ… సినిమా ఏ దశలో కూడా జోరు చూపలేదు.

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 18 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇండియా లో 35 కోట్ల నెట్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా. మొదటి వీకెండ్ లో  6.7 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సాధించగా మొదటి వారం లో 13.4 కోట్ల నెట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి….

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర… కేవలం 18 కోట్ల నెట్ కలెక్షన్స్ ని మాత్రమే సొంతం చేసుకుని టార్గెట్ లో సగం మాత్రమే రికవరీ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని పరుగును ముగించింది. ఈ సినిమా పై హోప్స్ పెట్టుకున్నారు కానీ సినిమా నిరాశనే మిగిలించింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here