బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ కలెక్షన్స్ ని సాలిడ్ గా సాధిస్తూ దూసుకు పోతూ ఉంది కానీ సోలో బ్రతుకే సో బెటర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంటర్ అవ్వక ముందు థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక రిలీజ్ అయిన స్ట్రైట్ సినిమాలు స్ట్రగుల్ అవుతున్న టైం లో ఒక డబ్బింగ్ మూవీ కి మాత్రం తెలుగు రాష్ట్రాలలో షాకింగ్ ఓపెనింగ్స్ లభించాయి. ఆ సినిమానే మమ్మీ ఈజ్ బ్యాక్…
మమ్మీ సినిమాకి సీక్వెల్ కూడా కాని ఈ సినిమా ఆ టైటిల్ తో పోస్టర్ లు థియేటర్ బయట కనిపించడం తో సింగిల్ స్క్రీన్స్ లో జనాలు మొదటి రోజు సినిమా చూడటానికి థియేటర్స్ కి వచ్చారు. దాంతో మొదటి రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 3 లక్షల దాకా…
షేర్ ని వసూల్ చేసి షాక్ ఇచ్చింది. అదే టైం లో స్ట్రైట్ మూవీస్ కేవలం లక్షన్నర రేంజ్ షేర్ నే అందుకోగా డబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత కూడా డీసెంట్ కలెక్షన్స్ ని సాధించింది. మొత్తం మీద 80 థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న మమ్మీ ఈజ్ బ్యాక్ సినిమా…
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.5 నుండి 7 లక్షల దాకా షేర్ ని వసూల్ చేసింది. సినిమా మొత్తం మీద టాక్ కంప్లీట్ నెగటివ్ గా ఉన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ స్ట్రైట్ సినిమాల కన్నా కూడా ఎక్కువగా ఉండటం విశేషం అనే చెప్పాలి… టోటల్ గ్రాస్ కలెక్షన్స్ మొత్తం మీద 12 లక్షల దాకా ఉంటుంది అని అంచనా..
అంటే జనాలు సినిమా పోస్టర్స్ ని చూసే థియేటర్స్ కి వెళ్లి కలెక్షన్స్ ని రప్పించారు… మొత్తం మీద సినిమా ఏమంత బాలేకున్నా కానీ ఉన్నంతలో సాధించిన కలెక్షన్స్ స్ట్రైట్ మూవీస్ కన్నా ఎక్కువ ఉండటం విశేషం. ఇక థియేటర్స్ లోకి ఈ వారం నుండి మరిన్ని సినిమాలు రానున్న నేపధ్యంలో బాక్స్ ఆఫీస్ మరింత జోరు చూపే అవకాశం ఉంది.