టాలివుడ్ లో ఒక టైంలో ఓ రేంజ్ లో రచ్చ చేసిన రీ రిలీజ్ ల ట్రెండ్ తర్వాత టైంలో ఓవర్ డోస్ వలన స్లో డౌన్ అయిపోగా రీసెంట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) పుట్టిన రోజు కానుకగా మురారి(Murari4K Re Release Collections) గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వగా, అల్ట్రా క్లాసిక్ మూవీ అవ్వడంతో మినిమమ్ ఇంపాక్ట్ చూపినా కూడా గొప్పే అనుకోగా…
సినిమా అనుకున్న దానికి మించి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపించింది. టాలీవుడ్ లో రీ రిలీజ్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో రికార్డ్ ను నమోదు చేసిన ఖుషి4K రికార్డులను సైతం బ్రేక్ చేసిన ఈ సినిమా ఓపెనింగ్ డే నుండి లాంగ్ రన్ ఆల్ మోస్ట్ 6 రోజుల పాటు…
కొనసాగగా ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాల వలన రన్ ని కంప్లీట్ చేసుకోగా ఓవరాల్ గా సినిమా రీ రిలీజ్ లో బిగ్గెస్ట్ రీ రిలీజ్ కలెక్షన్స్ ని నమోదు చేసి అప్ కమింగ్ మూవీస్ కి తిరుగులేని టార్గెట్ ను సెట్ చేసి పెట్టింది ఇప్పుడు.
ఒకసారి సినిమా రీ రిలీజ్ లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Murari4K Re Release Total Collections
👉Nizam – 5.01CR
👉Ceeded – 54L~
👉Andhra – 1.85CR~
AP-TG Total Collections – 7.39CR Gross
👉KA+ROI – 69L
👉OS – 81L~****
Total WW Collections – 8.90CR GROSS
నైజాంలో 5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో 8.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని రీ రిలీజ్ మూవీస్ పరంగా కొత్త రికార్డును నమోదు చేసింది…హైప్ తో వచ్చిన సినిమాలు రికార్డులు కొట్టొచ్చు కానీ ఆల్ రెడీ ఆల్ మోస్ట్ ఎండ్ అయిపొయింది అనుకున్న…
రీ రిలీజ్ ట్రెండ్ కి ఊపిరి పోసి అల్ట్రా క్లాసిక్ ఓల్డ్ మూవీతో వచ్చి ఈ రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకోవడం అన్నది మాత్రం మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక మురారి మూవీ నెలకొల్పిన ఈ రికార్డ్ రీ రిలీజ్ కలెక్షన్స్ ని అప్ కమింగ్ టైంలో ఏ రీ రిలీజ్ బ్రేక్ చేస్తుందో చూడాలి.